Switch to English

చైనా పైత్యానికి భారత్‌ అడ్డుకట్ట వేసేదెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మనకన్నా సైనిక బలంలో చాలా తక్కువ అయిన పాకిస్తాన్‌ విషయంలోనే ఆచి తూచి వ్యవహరించాల్సి వస్తోంది. మరి, మనకంటే సైనిక బలం చాలా ఎక్కువ వున్న చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే.? ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం 130 కోట్ల మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ‘మేరా భారత్‌ మహాన్‌..’ అంటూ దేశం కోసం రక్తం చిందించడానికి దేశ ప్రజానీకం ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. అయినాగానీ, యుద్ధం అంత తేలికైన వ్యవహారం కాదు. భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే తలెత్తే నష్టాల గురించి చైనా కూడా గట్టిగానే ఆలోచిస్తుంది. కానీ, పాకిస్తాన్‌ విషయంలో మనం అనుసరిస్తున్న వైఖరిని చూసి, చైనా కయ్యానికి కాలు దువ్వుతోందన్నది నిర్వివాదాంశం.

నిజానికి చైనా ఏనాడూ భారతదేశానికి మిత్రదేశం కాదు. శతృదేశమే. పాకిస్తాన్‌, చైనాలతో మాత్రమే భారతదేశం ఇప్పటిదాకా పూర్తిస్థాయి యుద్ధాలు చేసింది. పాకిస్తాన్‌తో పోల్చితే, చైనా నుంచి తీవ్రవాదం ముప్పు భారతదేశానికి లేదు. కానీ, పాకిస్తానీ తీవ్రవాదుల్ని ఎగదోయడంలో పాకిస్తాన్‌కి చైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనుకోండి.. అది వేరే విషయం.

ఇప్పుడు వివాదం లడఖ్‌ సరిహద్దుల్లోని గాల్వాయి లోయ గురించి. అదొక్కటే కాదు, అరుణాచల్‌ ప్రదేశ్‌ సహా పలు కీలక ప్రాంతాలపై చైనా కన్నేసింది ఎప్పటినుంచో. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు మరింతగా మనం సైన్యాన్ని మోహరించాల్సి వస్తోంది. ఏ క్షణాన ఎక్కడ ఎలాంటి దాడి చైనా నుంచి జరుగుతుందో తెలియని పరిస్థితి. ‘గాల్వాన్‌ లోయ మాదే..’ అని చైనా అంటోంది. ‘అరుణాచల్‌ ప్రదేశ్‌ కూడా మాదే’ అని ఎప్పటినుంచో అంటోంది. ‘మేం, మా ప్రాంతాల్ని తిరిగి దక్కించుకోవాలంటే.. భారత్‌తో యుద్ధం చేయక తప్పదు..’ అన్న ధోరణిలో వుంది చైనా. ఈ తరహా కుట్రలు చైనా ఎప్పటినుంచో పన్నుతూనే వుంది. మధ్యలో చిన్న గ్యాప్‌ అంతే.

అంతర్జాతీయ సమాజంలో చైనాని ఎండగట్టడం అంత తేలిక కాదు. కరోనా వైరస్‌ విషయంలో అమెరికా ఎంత గొంతు చించుకున్నా చైనాని దోషిగా నిలబెట్టలేకపోయింది. అగ్రరాజ్యానికే అలాంటి పరిస్థితి అంటే, చైనా విషయంలో మన పరిస్థితి ఏంటి.? అయితే, భారత్‌ తలచుకుంటే ఏం జరుగుతుందో చైనాకి కూడా బాగా తెలుసు. ఓసారి చైనాతో యుద్ధంలో భారత్‌ ఓడిపోయినా, సరిహద్దుల్లో చైనాకి ఎప్పటికప్పుడు భారత్‌ ధీటుగానే సమాధానం చెబుతోంది. కొన్నిసార్లు చైనా తోకముడిచింది కూడా. ఏదిఏమైనా, మోడీ సర్కార్‌కి ఇది అసలు సిసలు అగ్ని పరీక్ష. చైనాతో వివాదాన్ని మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందోగానీ.. ఈ సమయంలో రాజకీయాలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత మాత్రం అధికారంలో వున్న బీజేపీదే.

ముగ్గురు సైనికులు మాత్రమే చనిపోయారని తొలుత ప్రకటించి, ఆ తర్వాత ఆ సంఖ్యన 20గా చూపిన కేంద్రం, చైనా చెరలో వున్న 10 మంది విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. దాదాపు 50 మంది గాయపడ్డ విషయమూ ఆలస్యంగానే వెలుగు చూసింది. ఎలా చూసినా, ఇది చిన్న ఘటన కాదు.. పుల్వామా ఘటనతో పోల్చలేంగానీ, అంతటి తీవ్రత వున్న ఘటనే ఇది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...