చెన్నై కి ముంబై కి మధ్య జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై పైన ముంబై ఇండియన్స్ గెలిచే ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంది. ఈ రోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే జట్టు 2 వ క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై తో ఆడబోతుంది. ఈ సీజన్ లో పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు వరుస విజయాలతో సీజన్ మొత్తం లో 9 విజయాలు సాధించి పాయింట్ ల పట్టుక లో 3 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 6 మ్యాచ్ లలో విజయం సాధించి మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడం తో ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించుకుంది.
ఇరు జట్ల కీలక ఆటగాళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్ళ సమిష్టి కృషితో ప్లే ఆఫ్స్ కి చేరింది. ఒక్క ఆటగాడి పైన ఆధారపడకుండా జట్టు లో ప్రతి ఆటగాడు కీలక సమయాల్లో రాణించారు. బ్యాటింగ్ లో ప్రిథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లతో బలంగా కనిపిస్తుంది. ఆ జట్టు కీలక బౌలర్లు రబడ, మోరీస్ లు స్వదేశానికి వెళ్లిపోవడం తో బ్యాటింగ్ తో పోల్చుకుంటే బౌలింగ్ లో కాస్త బలహీనంగా కనిపిస్తుంది ఢిల్లీ జట్టు.
ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ గత రెండు మ్యాచ్ లలో ఓటమి పొందిన మెరుగైన నెట్ రన్ రేట్ తో ప్లే ఆఫ్స్ కి చేరింది. ప్లే ఆఫ్స్ కి ముందే సన్ రైజర్స్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన బైర్ స్టో , డేవిడ్ వార్నర్ లు వరల్డ్ కప్ నిమిత్తం స్వదేశానికి వెళ్లిపోవడం తో రైజర్స్ బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తుంది. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్ ఫామ్ లోకి రావడం ఆ జట్టు కి కాస్త ఊరట. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్, మహమ్మద్ నబి, రషీద్ ఖాన్ లతో పటిష్టంగా కనిపిస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు జరగగా ఢిల్లీ జట్టు 5 మ్యాచ్ లలో గెలవగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్ లలో విజయం సాధించింది…