సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా రేపు విడుదలకు సిద్ధమైంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో స్పెషల్ షోస్ వేయడమే కాకుండా .. టికెట్స్ రేట్స్ కూడా భారీగా పెంచారన్న విషయం పై మీడియాలో న్యూస్ హల్చల్ అవుతున్నాయి. థియేటర్స్ టికెట్ రేట్స్ భారీగా పెంచేశారంటూ అటు సినిమా ప్రేక్షకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. మాములుగా ఉన్న టికెట్స్ రేట్స్ ని 200 రూపాయలకు పెంచారంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. తాజాగా ఈ విషయం పై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. ఈ సినిమా రేపు విడుదల అవుతున్న సందర్బంగా బుధవారం అయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ..
మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమాగా వస్తున్న మహర్షి భారీ అంచనాల మధ్య మరి కొన్ని గంటల్లో విడుదల అవుతుంది. ఈ సినిమాకోసం ఐదు షోల విషయంలో తెలంగాణా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక ఆంధ్రా లో కూడా పర్మిషన్ వచ్చింది. అయితే ఈ ప్రత్యేక షోల విషయంలో టికెట్స్ రేట్స్ పెంచారంటూ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇది తప్పుడు ప్రచారంగా మారింది. టికెర్స్ రేట్స్ పెంచడం అన్నది ఇప్పుడు కొత్తగా వస్తున్న విషయం కాదు. ఇంతకుముందు పండగ సమయాల్లో పెద్ద సినిమాలకు టికెట్స్ రేట్స్ పెంచుకునే వీలును కల్పిస్తూ ప్రభుత్వం జీవో పాస్ చేస్తుంది. ఇప్పుడు అలాగే జరిగింది. ఇక థియేటర్స్ టికెట్స్ రేట్స్ పెరగడం అన్నది మేము చేసింది కాదు. అది థియేటర్స్ ఓనర్స్ ఎవరికీ వారే సొంతంగా కోర్టుకు వెళ్లి ఈ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్స్ ప్రమేయం కూడా ఏమి లేదు. అది ఆయా థియేటర్స్ యాజమాన్యాల పర్సనల్ అప్పీల్.
ఇక మహర్షి సినిమా విషయంలో చాలా నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా మహేష్ కెరీర్ లో నిలిచిన బెస్ట్ సినిమాల సరసన మహర్షి కూడా నిలబడుతుంది. ఈ సినిమా విషయంలో నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నేను విడుదలకు ముందు చాలా సినిమాల విషయంలో జడ్జిమెంట్ చెప్పాను. అందులో పది సినిమాలను జెడ్జి చేస్తే అందులో తొమ్మిది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి నా నమ్మకం వమ్ముకాదు. ఇక దర్శకుడు వంశీ ఈ సినిమాతో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరతాడు అంటూ చెప్పాడు. మొత్తానికి మహర్షి ప్రపంచ వ్యాప్తంగా 2000 కుపైగా థియేటర్స్ లో విడుదల అవుతుంది. నాన్ బాహుబలి కేటగిరి కింద ఇదే హయ్యెస్ట్ రిలీజ్ అన్నారు.