చిరంజీవి తన గత చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం ఏకంగా సంవత్సరం కేటాయించారు. ఆ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కారణంగా సినిమా విడుదల చాలా ఆలస్యం అయ్యింది. ఖైదీ నెం.150 చిత్రం తర్వాత సైరా రావడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది. అందుకే తదుపరి చిత్రంకు అస్సలు ఆలస్యం చేయవద్దనుకున్న చిరంజీవి ఇటీవలై కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేస్తానంటూ కొరటాల శివ శపథం చేశాడు. దాంతో సినిమాను సమ్మర్ పూర్తి అయ్యేప్పటికి పూర్తి చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రం గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే ఈ సినిమాను ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ చిత్రంలో చిరంజీవి ఉద్యమ నాయకుడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. రంగస్థలం చిత్రం కోసం వేసిన రంగస్థలం గ్రామ సెట్టింగ్స్‌లోనే ఈ సినిమా ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకుంటాడా చూడాలి.
315938 791832This web site is my aspiration , quite amazing pattern and perfect articles . 446838
94673 812218Wonderful beat ! I wish to apprentice while you amend your web internet site, how can i subscribe for a weblog internet site? The account aided me a appropriate deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear idea 246338
282648 724997Hello! I basically want to make a enormous thumbs up with the amazing info youve here during this post. We are returning to your weblog for additional soon. 690376