Switch to English

మనోళ్ల వల్లే ఆ హెలికాప్టర్ కూలింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

శతృదేశ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేయడానికి క్షిపణలు ప్రయోగించడం కామన్. అయితే, మన మిస్సైల్ కారణంగా మన హెలికాప్టరే కూలిపోయిన విషయం తాజాగా వెల్లడైంది. ఇది అత్యంత భారీ తప్పిదమని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) స్వయంగా పేర్కొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు పాక్ ఎఫ్-16 విమానాలు మన భూభాగంలోకి చొచ్చుకురాగా, మన సుఖోయ్-30 విమానాలతోపాటు మిరాజ్-2000 విమానాలు వాటిని వెంబడించాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశాడు.

అదే సమయంలో ఆయన మిరాజ్ విమానం కూడా కూలిపోగా, అభినందర్ పాక్ దళాల చేతికి చిక్కాడు. అదే రోజు శ్రీనగర్ లో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. అందులో ఉన్న ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పాకిస్తాన్ పనేమో అని తొలుత అనుమానాలు వ్యక్తంకాగా, సాంకేతిక కారణాలతోనే అది కూలిపోయిందని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన ఏడు నెలల తర్వాత ఆసక్తికరమైన సంగతిని వెల్లడించారు. ఆ హెలికాప్టర్ మన అధికారుల తప్పిదం కారణంగానే కూలిపోయిందని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బహదూరియా తెలిపారు. ఐఏఎఫ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కాలంగా భారత వైమానిక దళం ఎన్నో గొప్ప విజయాలను సాధించిందని చెప్పారు.

ముఖ్యంగా బాలాకోట్ దాడి సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. భవిష్యత్తులో బాలాకోట్ తరహా దాడులు జరుగుతాయా అని ప్రశ్నించగా.. వారు (పాకిస్థాన్) ఉగ్రదాడులకు తెగబడితే దానిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము స్పందిస్తామని పేర్కొన్నారు. పాక్ చొరబాట్లకు పాల్పడితే మాత్రం సహించబోమన్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 27న శ్రీనగర్ లో ఎంఐ-17 చాపర్ కూలిపోవడానికి కారణం స్వీయ తప్పిదమే అన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.

తమ అధికారులు ప్రయోగించిన క్షిపణి కారణంగానే ఆ హెలికాప్టర్ కూలిపోయిందని వివరించారు. ‘‘ఈ విషయంలో దర్యాప్తు పూర్తయింది. అది పూర్తిగా మా తప్పిదం వల్లే జరిగింది. మేం ప్రయోగించిన క్షిపణి తగలడంతోనే ఆ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు అధికారులకు సస్పెండ్ చేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం జరగకుండా చూసుకుంటాం’’ అని బహదూరియా స్పష్టంచేవారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...