Switch to English

మాంద్యం దెబ్బ.. మనపై ఎంత?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మాంద్యం వస్తే అన్నీ ఇబ్బందులేనని, ఉద్యోగాలు ఉండవని, ఉపాధి కరువవుతుందని, తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? అది వస్తే సామాన్య జనంపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే.. ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభం అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడమే.

ఒక వస్తువును ప్రజల కొనలేకపోతున్నారంటే దాని ప్రభావం ఒకరి నుంచి మరొకరికి గొలుసుకట్టు రూపంలో పడుతుందన్నమాట. ఉదాహరణకు.. రవి ఉద్యోగం చేస్తూ నెలకోసారి జీతం తీసుకుంటున్నాడు. అలా తీసుకున్న జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం వెచ్చించడంతోపాటు ఇతరత్రా సౌకర్యాలను పొందడానికి ఖర్చు చేస్తున్నాడు. జీతం వచ్చింది కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ రెస్టారెంటుకు వెళ్లి రూ.500 ఖర్చు పెట్టి భోజనం చేశాడు. ఆ రెస్టారెంట్ యజమాని తన దగ్గర పనిచేస్తున్న కుర్రాడికి జీతం ఇచ్చాడు. అతడు ఆ డబ్బుతో సాయంత్రం పూట సరదాగా సినిమాకు వెళ్లాడు. సినిమా థియేటర్ యజమాని ఆ సొమ్ముతో తన కుమార్తెకు ఓ బొమ్మ కొన్నాడు. ఆ బొమ్మల షాపు యజమాని తన రుణ వాయిదా చెల్లించాడు. బ్యాంకు ఆ డబ్బుతో మరొకరికి రుణం మంజూరు చేసింది. ఇక్కడ ఉన్నది ఒక్క రూ.500 మాత్రమే. కానీ అది ఒకరి నుంచి మరొకరికి చేతులు మారడం వల్ల ఒక్క రోజులో రూ.3వేల విలువైన లావాదేవీలు జరిపింది. ఇదంతా రవికి తన జీతం సక్రమంగా వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది.

ఒకవేళ రవికి ఉద్యోగం పోయి, జీతం రాకపోతే.. అతడు రెస్టారెంటుకు వెళ్లి భోజనం చేయడు. దాంతో రెస్టారెంటు కుర్రాడికి జీతం రాదు. అతడు సినిమా చూడలేడు. థియేటర్ యజమాని బొమ్మ కొనలేడు. బొమ్మల షాపు యజమాని రుణ వాయిదా చెల్లించలేడు. బ్యాంకు దివాళా తీస్తుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. మాంద్యం మనపై చూపించే ప్రభావం స్థూలంగా ఇలాగే ఉంటుంది.

ప్రస్తుతం దేశంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభం ప్రమాద ఘంటికలు మోగించేసింది. నెమ్మదిగా ఒక్కో రంగానికీ సెగ తాకుతోంది. తొలుత ఆటోమొబైల్ రంగంపై దీని ప్రభావం పడింది. కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దీంతో కంపెనీలు కార్ల ఉత్పత్తి ఆపేయడంతోపాటు క్రమంగా ప్లాంట్లను మూసేస్తున్నాయి. ఫలితంగా ఒక్క జూలైలోనే దాదాపు 2.3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. అలాగే మరో 10 లక్షల మంది ఉద్యోగాలకు సైతం ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆటోమొబైల్ రంగం గతంలో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి ఎదుర్కోలేదు. కార్ల ఉత్పత్తి తగ్గడంతో అటు స్టీల్, టైర్లు, ఇతరత్రా మెటీరియల్ ఉత్తత్తి సంస్థలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అక్కడ కూడా పొదుపు చర్యలు తప్పనిసరి అవుతున్నాయి. ఇక రోజువారీ ఉపయోగించే నూనెలు, ఉప్పు, కారాల వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విషయంలోనూ మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. ఆయా కంపెనీల వృద్ది రేటు సైతం భారీగా క్షీణించింది.

అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే.. కేంద్రం తీసుకున్న విధానాలే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించాయని చెబుతున్నారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలతో అసలు బ్యాంకులు అంటేనే భయపడే పరిస్థితికి ప్రజలు రావడం, జీఎస్టీ అమలు వ్యాపారస్తులపై ప్రభావం చూపడం, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి క్షీణత వంటి అంశాలు మన దేశాన్ని మాంద్యం కోరల్లోకి తీసుకెళ్తున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...