ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. గతంలో ఆమె జైలుకు వెళ్ళారు. తీవ్రమైన నేరాభియోగాల్ని ఎదుర్కొన్నారు. కానీ, ఆ ఆరోపణల నుంచి ఎలాగైతేనేం ఆమె కాస్త ఊరట పొందారు. తిరిగి ఉద్యోగాన్ని కూడా పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో వున్నారామె. పరిచయం అక్కర్లేని పేరామెది.. ఆమె ఎవరో కాదు.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి.
రాజధాని అమరావతికి సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులకు చంద్రబాబు హయాంలో ‘లబ్ది’ చేకూరిన దరిమిలా, ఆ ఇద్దరు న్యాయమూర్తులు విచారణకు దూరంగా వుండాలన్నది ప్రభుత్వం తరఫున ఐఏఎస్ శ్రీలక్ష్మి కోర్టును కోరిన అంశం.
శ్రీలక్ష్మి తీరుపై రాష్ట్ర హైకోర్టు ఒకింత అసహనం వ్యక్తం చేసింది. అంతేనా, సెటైర్లు కూడా సంధించింది. ‘సీనియర్ మరియు సిన్సియర్ ఆఫీసర్..’ అంటూ శ్రీలక్ష్మి గురించి ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానం పేర్కొన్న విషయాల్ని యధాతథంగా టీడీపీ అనుకూల మీడియా జనం ముందుంచింది. చిత్రమేంటంటే, వైసీపీ అనుకూల మీడియా కూడా ఆ విషయాల్ని అచ్చం అలాగే జనం ముందుకు తీసుకురావడం.
అవినీతి ఆరోపణలున్నాయి శ్రీలక్ష్మి మీద. ఆ ఆరోపణల నుంచి పూర్తిగా ఆమెకు విముక్తి లభించలేదు. అలాంటి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ అదికారిణి హోదాలో, ఏకంగా న్యాయమూర్తులపైనే అనుమానాలు వ్యక్తం చేస్తే.. న్యాయస్థానం ఆ మాత్రం ఘాటైన సెటైర్లు వెయ్యకుండా వుంటుందా.?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనీ, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్నారనేది ప్రధాన అభియోగం. అప్పట్లో, ఈ కేసులకు సంబంధించి చాలామందిపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ సహా చాలామంది జైలుకు వెళ్ళారు. అలా జైళ్ళకు వెళ్ళినవాళ్ళలో ఐఏఎస్ అధికారులూ వున్నారు.
తాను అధికారంలోకి వచ్చాక, అలాంటివారిలో చాలామందిని ‘అక్కున చేర్చుకున్నారు’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ నాయకులు ‘స్వామి భక్తి’ ప్రదర్శిస్తే అదో లెక్క.. అధికారులూ అలాగే వ్యహరిస్తే, కోర్టులు ఇదిగో.. ఇలా సెటైర్లు వేయాల్సి వస్తుంది మరి.!
64902 323458You will discover some fascinating points in time in this post but I do not know if I see all of them center to heart. Theres some validity but I will take hold opinion until I appear into it further. Wonderful post , thanks and we want considerably far more! Added to FeedBurner too 681152
263523 731338omg! cant picture how fast time pass, after August, ber months time already and Setempber is the initial Christmas season in my location, I really really like it! 960552
330494 45165But wanna comment on few common issues, The internet site style is perfect, the content material is really excellent : D. 432420
404292 734810Woh I enjoy your articles , saved to favorites ! . 122868