Switch to English

కరోనా విషయంలో తెలంగాణ తీరు మారట్లేదెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో ఏ రోజైనా కరోనా వైరస్‌ టెస్టుల సంఖ్య 25 వేలు దాటే అవకాశముందా.? ఇంకా నయ్యం.. 20 వేల టెస్టులు చేయడమే కనాకష్టంగా మారిపోయింది. 15 వేలకు అటూ ఇటూగా మాత్రమే సంఖ్య కన్పిస్తోంది. అది కూడా హైకోర్టు మొట్టికాయలేయడంతో 10 వేలు దాటిందిగానీ.. లేకపోతే ఐదారు వేలతో సరిపెట్టేదే తెలంగాణ ప్రభుత్వం. ఎందుకిలా.? ధనిక రాష్ట్రం తెలంగాణలో అవసరమైన మేర కరోనా టెస్టులు ఎందుకు జరగడంలేదు.? పైగా, చేసిన టెస్టులకు సంబంధించి ‘మీడియా బులెటిన్‌’ కూడా సరిగ్గా రావడంలేదాయె.

ఈ విషయమై ఒకటికి పదిసార్లు హైకోర్టు మొట్టికాయలేసినా ఫలితం కన్పించడంలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కరోనా టెస్టుల్లో చాలా వేగం ప్రదర్శిస్తోంది. 50 వేల మార్క్‌ని కూడా టచ్‌ చేసింది. తమిళనాడు అయితే 60 వేల మార్క్‌ కూడా దాటేసింది రోజువారీ టెస్టుల్లో.

నిజానికి, భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులు చాలా చాలా తక్కువ. ఇంకా చాలా ఎక్కువ టెస్టులు జరగాల్సి వుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రోజుకి 50 వేల నుంచి లక్ష టెస్టులు జరగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే, ప్రతిరోజూ సాయంత్రం విడుదల కావాల్సిన బులెటిన్‌ కాస్తా.. ఇప్పుడు ఉదయం వస్తోంది. అది కూడా నిన్నటి ఫలితాలు ఈ రోజు అన్న మాట. ఇదేం పద్ధతి.? హైకోర్టు మరింత సీరియస్‌గా వార్నింగ్‌ ఇవ్వడంతో 50కి పైగా పేజీలతో కూడిన బులెటిన్‌ వచ్చింది. అయితే, ఆ బులెటిన్‌లో కొత్త విషయాలు ఏమీ లేవనే పెదవి విరుపులు ఆయా రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయి.

మొదట్లో కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు కన్పించింది. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. కరోనా టెస్టులు ఎక్కవ చేయించుకోవాలో తెలియక గ్రేటర్‌ పరిధిలోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్కడ లోపం జరుగుతోంది.? అధికారుల స్థాయిలోనా.? ప్రభుత్వ పెద్దల స్థాయిలోనా.? అన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు. ‘మేం అత్యద్భుతంగా పనిచేస్తున్నాం.. అందుకే తెలంగాణలో కేసులు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తక్కువగా వున్నాయి.. మరణాల సంఖ్య కూడా తక్కువగా వుంది..’ అని మంత్రి ఈటెల రాజేందర్‌ చెబుతున్నారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు మాత్రం దారుణంగా మారిపోతున్నాయన్నది నిర్వివాదాంశం.

ఇదిలా వుంటే, హైకోర్టులో తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితిపై విచారణ జరిగింది. కరోనా మరణాల్ని ప్రభుత్వం దాస్తోందంటూ వస్తున్న ఆరోపణలపైనా సంబంధిత శాఖల నుంచి నివేదిక కోరింది హైకోర్టు. కరోనా బులెటిన్‌లో తప్పులు లేకుండా చూడాలనీ, సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో వుంచాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోసారి సీఎస్‌ సహా ఉన్నతాధికారులు హైకోర్టులో విచారణకు హాజరు కావాల్సి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...