Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అంబులెన్స్‌ రాదాయె.. చెత్త బండే దిక్కాయె.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఈ మధ్యనే గుంటూరు జిల్లాలో కరోనా సోకిన ఓ వ్యక్తి, అంబులెన్స్‌ కోసం ఎదురుచూసి నడి రోడ్డుపైనే ప్రాణాలు వదిలితే.. గంటల తరబడి ఆ మృతదేహాన్ని కూడా తరలించడానికి ఎవరూ ముందుకు రాని దుస్థితిని చూశాం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, డ్రోన్‌ కెమెరాలతో ఆ మధ్య ‘కొత్త అంబులెన్సుల పెరేడ్‌’ నిర్వహించింది. ఊరూ వాడా ఆ అంబులెన్సులకు వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. కొందరు వైసీపీ ప్రజా ప్రతినిథులైతే అంబులెన్సుల్ని డ్రైవ్‌ చేస్తున్నట్లుగా ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఎందుకీ పబ్లిసిటీ స్టంట్లు.? అని ప్రశ్నిస్తే, ఎదురుదాడి తప్ప.. బాధ్యతాయుతమైన సమాధానం అధికార పార్టీ నేతల నుంచి రావడంలేదు.

‘పబ్లిసిటీ జాస్తి.. పని మాత్రం నాస్తి..’ అన్నట్టు తయారైంది గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితి. ఓ అంబులెన్స్‌లో ఒకర్ని కాదు.. పది మందికి పైగానే కూరేశారు ఓ జిల్లాల్లో.. వాళ్ళల్లో కొందరు కరోనా రోగులు, ఇంకొందరు కరోనా అనుమానితులు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ తరహా ఘటనలు చాలానే కన్పిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా బాధితుడ్ని చెత్త బండిలో ఆసుపత్రికి తరలించారు. మరి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అట్టహాసంగా జెండా ఊపి ప్రారంభించిన అంబులెన్సులు ఏమైనట్లు.? అవన్నీ పని చేయడంలేదని కాదు.. కానీ, అత్యవసర సందర్భాల్లో అక్కరకు రాకపోతే ఉపయోగమేంటి.?

కొన్ని అంబులెన్సులు సాంకేతిక సమస్యలతో రోడ్ల మీద ఆగిపోతున్నట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. మొన్నామధ్య ఓ అంబులెన్స్‌లో డీజిల్‌ లేకపోవడంతో అర్థాంతరంగా ఆగిపోయేసరికి, అత్యవసర సమయంలో బాధితులకు అంబులెన్స్‌ ఉపయోగపడలేకపోయింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు స్పందించాలి. వైఫల్యాలపై సమీక్షించుకోవాలి.. ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఆయా అంబులెన్స్‌ సర్వీసుల్ని నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థల్ని అప్రమత్తం చేయాలి, వీలైతే హెచ్చరించాలి. ఇవన్నీ మానేసి, విపక్షాలపై ఎదురుదాడికి దిగేందుకు మాత్రమే అధికార పార్టీ నేతలు అత్యుత్సాహం చూపుతుండడం గమనార్హం.

రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అంబులెన్స్‌ల కొరత వుండడం అనేది తప్పకపోవచ్చు. కానీ, అత్యంత హస్త్రయంగా చెత్త బండిలో కరోనా బాధితుడ్ని తరలించాల్సి రావడమేంటి.? దీనికి కారణమైన సంబంధిత శాఖల అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే, ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వుంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...