GIS Summit 2023: విశాఖ కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(GIS Summit 2023) ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ‘ఎంవోయూ’లు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ‘సమ్మిట్’ కేవలం పబ్లిసిటీ స్టంట్కే పరిమితమైందనీ, తాము మాత్రం నిఖార్సుగా పెట్టుబడులు రప్పిస్తున్నామని వైసీపీ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, జగన్ సర్కారు చెబుతున్న 13 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల్లో ఎన్ని ‘గ్రౌండ్’ అవుతాయా.? నిజానికి, ఈ ‘సమ్మిట్’ అంటేనే, అదో పబ్లసిటీ స్టంట్. ఖర్చు దండగ వ్యవహారం తప్ప, వీటి వల్ల రాష్ట్రానికి అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏమీ వుండదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ, పెట్టుబడుల్ని ఆహ్వానించడంలో ముందంజలో వుంది.
ఎప్పటికప్పుడు పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం కొత్త పరుగులు అందుకుంటోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితే నానాటికీ దిగజారిపోతోంది. కేవలం పబ్లిసిటీ స్టంట్లు తప్ప రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులకు చిత్తశుద్ధి వుండటంలేదు.. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది అదే.. ఇప్పుడు జగన్ హయాంలోనూ జరుగుతున్నది అదే.
ఇన్వెస్టర్ల పేరుతో కొందరు బడాబాబుల్ని రప్పించడం, వారికి అక్కడ హంగామా కనిపించేలా చేయడానికి, ‘ఛోటా ఇన్వెస్టర్ల’ పేరుతో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను రంగంలోకి దించడం గతంలోనూ జరిగింది, ఇప్పుడూ జరిగింది.
నిజానికి, 13 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఆ మొత్తం గనుక అలాగే గ్రౌండ్ అయితే, ఏడాది.. రెండేళ్ళు తిరగకుండానే దేశంలోనే అగ్రగామి రాష్ట్రమవుతుంది ఆంధ్రప్రదేశ్. అంతెందుకు, ప్రపంచంలోనే అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ తిరుగులేని రాష్ట్రమవుతుంది.
సమ్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత.? మరీ ముఖ్యంగా ఈ సదస్సుకి సంబంధించి పబ్లిసిటీ నిమిత్తం జరిగిన ఖర్చు ఎంత.? మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన.. అసలే అప్పుల్లో వున్న రాష్ట్రానికి ఈ దుబారా కారణంగా తల బొప్పి కట్టేస్తోంది.!
363167 687706Its excellent as your other content material : D, appreciate it for posting . 38958
158182 223527Id need to talk to you here. Which isnt something Which i do! I love to reading a post that really should get individuals to feel. Also, thank you for allowing me to comment! 638183
776716 862750I enjoy your writing type, do keep on writing! Ill be back! 697823
930534 501411I like this internet website because so a lot utile stuff on here : D. 479139
323971 724091Yeah bookmaking this wasnt a risky decision outstanding post! . 558033
794671 15520This web-site is in fact a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and you will definitely discover it. 234211