ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానించేందుకు కేంద్రం గడువు పెంచింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో వీటిని లింక్ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాము గ్రహించామని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈనేపథ్యంలో జూన్ 30 వరకు గడుపు పొడిగిస్తున్నామని పేర్కొంది. ఆలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
అంతకుముందు మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. లేదంటే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలని పేర్కొంది. తాజా ఉత్తర్వులతో ప్రజలకు ఈ విషయంలో ఊరట లభించింది. ఈ క్రమంలో ఆధార్ తో పాన్ కార్డును ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఆపై స్టేటస్ తెలుసుకోవచ్చు.
- గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ సెర్చ్ చేయాలి.
- ‘క్విక్ లింక్స్’ విభాగం కింద.. వెబ్‌పేజీకి ఎడమ వైపు ఉన్న ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డు బాక్సులో ఆధార్ నెంబర్, మీ పేరు, పాన్ నెంబర్ బాక్స్ లో పాన్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
- పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో ఉన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి.
- ‘నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను’ అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి.
- మీ స్క్రీన్‌పై వచ్చిన క్యాప్చా కోడ్‌ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయాలి.
- క్యాప్చా కోడ్ అర్ధం కాకపోయినా.. దృశ్య లోపం ఉన్నా.. వినియోగదారులు క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్వర్డ్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
- వన్-టైమ్ పాస్వర్డ్ ఆప్షన్ ను ఎంచుకుంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
- ‘లింక్ ఆధార్’ అని ఉన్న బటన్ పై క్లిక్ చేస్తే మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి.
231642 936625I enjoy your function , regards for all of the informative posts . 705596
661327 186625Id forever want to be update on new articles on this web site, bookmarked ! . 891497
498212 262962really very good post, i surely adore this exceptional website, keep on it 780442
812484 271414appreciate the effort you put into finding us this info 801494