Switch to English

ఎడిటోరియల్: జగన్ పరువు మొత్తం ఒక్క ప్రెస్ మీట్ తో గోవిందా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

నిన్నటి నుంచి ఎన్నికల కమిషర్ నిమ్మగడ్డ రమేష్ కు జగన్ సర్కార్ కు మధ్య డీ అంటే డీ అనే విధంగా మాటల యుద్ధం జరుగుతున్నది. కేంద్రం నుంచి వచ్చిన సూచనల విశ్లేషించుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేసినట్టుగా ఎన్నికల కమిషనర్ నిన్న సాయంత్రం క్లారిటీ ఇచ్చారు. కరోనా ప్రభావం ప్రపంచంలో తీవ్రంగా ఉందని, కరోనా వలన ప్రపంచం మొత్తం వణికిపోతోందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇండియాలో కూడా కరోనా ప్రభావం దారుణంగా ఉన్నది.

కరోనా వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భయం చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నోటిఫైడ్ నేషనల్ డిజాస్టర్ గా కరోనాను గుర్తించింది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యాపించింది. జనసమూహం లేకుండా చూడాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహిస్తే జనాలు సమూహంగా ఉంటారు. ఎన్నికల ప్రచారం, కోలాహలం ఉంటుంది.

ఇలాంటి సమయంలో కరోనా ఉన్న వ్యక్తిని ఎవరైనా కలిస్తే పరిస్థితి ఏంటి. ఎలా మారిపోతుంది. సిట్యుయేషన్ ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయాలు అర్ధం చేసుకోవాలి. ఇదంతా అలోచించి ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

అయితే, ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు నాయుడు హయంలో నియమించారని, దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఎన్నికలు పోస్ట్ ఫోన్ చేశారని వైకాపా నేతలు, మంత్రులు చివరకు సీఎం కూడా వ్యాఖ్యానించడం విడ్డూరంగా మారింది. ఎన్నికల కమిషన్ అన్నది ఓ స్వతంత్ర సంస్థ. అందులో రాజకీయాలకు తావుండదు. రాజ్యాంగ బద్దంగా నడుస్తుంది. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వానికే కాకుండా, ఇలాంటి స్వతంత్రమైన రాజ్యాంగబద్ధమైన సంస్థలకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి.

వాటిని ఇటువంటి సమయంలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి తనను తాను తక్కువ చేసుకున్నారు. ఎన్నికలు పోస్ట్ ఫోన్ చేసినందుకు వివరణ అడిగితె సరిపోయేది. దానికోసం ఏకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విమర్శలు చేయడం వలన ఏమైనా ఫలితం ఉన్నదా? ఇప్పుడు దేశంలో అందరిమనుకుంటున్నారు.. ఏపీకి ప్రజలకంటే, ప్రజల ప్రాణాల కంటే కూడా ఎన్నికలే ముఖ్యం.

కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఎన్నికలు వాయిదా వేశామని చెప్పినా దాన్ని తప్పుపట్టి ఇలా గొడవ చేస్తున్నారు అనే టాక్ వచ్చింది. పైగా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటే ఉందని, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తూనే, ఇలాంటి వైరస్ లకు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పి తన పరువును తానే తీసుకున్నారు.

పారాసిటమాల్ వేసుకునే దానికి ప్రపంచదేశాలు ఎందుకు కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వ్యక్తులే చనిపోతారు అంటే, వుహాన్ నగరంలో సరిగా 40 కూడా లేని చాలామంది వైరస్ బారిన పడి మరణించారు. అందులో వైద్యులు కూడా ఉన్నారు. మరి దీని గురించి ఏమనాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...