సినిమాలు తెరకెక్కే అనేక జోనర్స్ లో దేశభక్తి ఒకటి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి నేటి వరకూ దేశభక్తి సినిమాలు వస్తూనే ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి వీరగాధలు.. దేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదం, ఉగ్రవాదం నేపథ్యంలో మన సైనికులు చూపుతున్న ధైర్య సాహసాలను కూడా ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ తరహా కథల్లో మెగాస్టార్ చిరంజీవి సైతం అనేక సినిమాల్లో నటించారు. దేశభక్తిని చాటే పాత్రలు, డైలాగులు ఆయన నటించిన సినిమాల్లో ఉన్నాయి. కేవలం కమర్షియల్ కథాంశాలే కాకుండా సినిమా ద్వారా ఎందరో ప్రభావితం అవుతారనే ఉద్దేశంతో బాధ్యతాయుతంగా ఈ తరహా పాత్రల్లో నటించారు చిరంజీవి.
కెరీర్ లో తొలి సినిమా పునాదిరాళ్లులోనే దేశభక్తిపై ‘దేశానికి పునాదిరాళ్లైన ఆ పల్లెలే నిస్సారమైతే.. ప్రజలే నిర్జీవులైతే ఆ దేశం బాగుపడదు’ అనే డైలాగ్ చిరంజీవి చెప్తారు. చాణక్య శపథం సినిమాలో కస్టమ్స్ ఆఫీసర్ గా నటించారు. స్మగ్లింగ్ గ్యాంగ్ ఆట పట్టించే పాత్రలో చిరంజీవి నటించారు. రుద్రనేత్రలో ఏజెంట్ నేత్రగా దేశద్రోహులు చేసే అక్రమాలను ఎదుర్కొని దేశం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడే పాత్రలో నటించారు. యుద్ధభూమిలో మిలిటరీ సైనికుడిగా నటించారు. సినిమాలో చిరంజీవి సైనికుడిగా యుద్ధభూమిలో పాల్గొని శత్రువులతో పోరాడే పాత్రలో నటించారు. సిపాయి అనే కన్నడ సినిమాలో కూడా సైనికుడిగా నటించారు. శత్రుమూకలు జరిపే దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందే పాత్రలో చిరంజీవి నటించారు.
ముఠామేస్త్రిలో దేశంపై ప్రేమ ఉన్న పౌరుడిగా చిరంజీవి పలు సన్నివేశాల్లో కనిపిస్తారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవి సైనికుడిగా నటించారు. ఈ సినిమాలో కూడా యుద్ధవీరుడిగా ఆన్ ఫీల్డ్ వార్ లో పోరాడే సైనికుడిగా నటించారు. సైరా.. నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి భారతదేశం తొలి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. దేశభక్తిని చాటే కథాంశంలో చిరంజీవి తన పాత్రలో ఒదిగిపోవడంతో ప్రేక్షకులు నరసింహారెడ్డి పాత్రకు కనెక్ట్ అయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే పాత్రలో చిరంజీవి అద్భుత నటన ప్రదర్శించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చిరంజీవి నటన అద్భుతం అని చెప్పాలి. ఇవి కాకుండా చిరంజీవి అనేక సినిమాల్లో పోలిస్ ఆఫీసర్ గా కూడా నటించారు.