Switch to English

ఆఖరి మెట్టుపై ఆగిపోయింది.. !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కోట్లాది మంది భారతీయుల ఆశలను జాబిలి పైకి మోసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి మెట్టుపై ఆగిపోయింది. మరికొద్ది క్షణాల్లో గమ్యం చేరుకుంటుందనగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పటివరకు సజావుగా ఒక్కో దశ దాటుకుంటూ వెళ్లిన విక్రమ్ ల్యాండర్.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలానికి కేవలం 2.1 కిలోమీటర్ల ఎత్తులో అంతర్థానమైంది. అప్పటివరకు అంతా చక్కగా జరగ్గా.. చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ నుంచి భూమికి సంకేతాలు నిలిచిపోయాయి.

ఈ ప్రక్రియలో కీలకమైన 15 నిమిషాలలో 14 నిమిషాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోగా.. ఇక విజయం అందుకునే తరుణంలో తడబాటుకు గురైంది. ఫలితంగా మన చందమామ చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ తాను వెళ్లాల్సిన మార్గం నుంచి కొంచెం దారి తప్పడం.. తర్వాత దాని నుంచి భూమికి సంకేతాలు నిలిచిపోవడంతో ఏమి జరిగిందో అర్థం కాలేదు. ల్యాండర్ నుంచి సంకేతాల కోసం ఎదురుచూసినా ఎలాంటి ఫలితం రాలేదు.

దీంతో ఇస్రో చైర్మన్ క్లుప్తంగా కీలక ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సవ్యంగానే సాగిందని, అక్కడ సమస్య తలెత్తడంతో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయని చెప్పారు. ఆ డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. దేశం గర్వించే క్షణాన్ని కనులారా వీక్షించాలని నిద్రపోకుండా చూసిన యావత్ భరతజాతి ఒక్కసారిగా ఉద్విగ్నతకు గురైంది.

Chandrayan

అటు ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు చైర్మన్ శివన్ కూడా డీలాపడగా.. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడకు వచ్చిన ప్రధాని మోదీ వారికి ధైర్యం చెప్పారు.ఇప్పటివరకు ఇస్రో సాధించింది తక్కువేమీ కాదని స్పష్టంచేశారు. అంతా మంచే జరుగుతుందనే దృక్పథంతో ముందుకెళదామని సూచించారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని శివన్ భుజం తట్టి మరీ చెప్పారు.

అనంతరం ఈ ప్రయోగాన్ని నేరుగా వీక్షించేందుకు వచ్చిన పలువురు విద్యార్థులతో ప్రధాని కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. కాగా, ల్యాండర్ నుంచి సంకేతాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అప్పటివరకు అందిన ఫ్లైట్ డేటాను విశ్లేషిస్తే, కారణాలు తెలిసే అవకాశం ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...