Switch to English

వైద్య చరిత్రలో అద్భుతం: చనిపోయిన 117 రోజుల తర్వాత ప్రసవం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

వైద్యో నారాయణో హరీ అంటారు.. వైద్యుడు నిజంగా దేవుడితో సమానం. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుడు సృష్టి చేస్తే, వైద్యుడు ప్రతిసృష్టి చేస్తాడు. గుంటూరులో 73 ఏళ్ల వృద్ధురాలికి కవల పిల్లలుపుట్టడం, వారు ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్ల కృషే కారణం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ డాక్టర్ల గురించి ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంతకుమించిన సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఇక్కడ ఏకంగా చనిపోయిన మహిళ కడుపులో పెరుగుతున్న పిండాన్ని సజీవంగా ఉంచి 117 రోజుల తర్వాత సిజేరియన్ చేసి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో చెక్ రిపబ్లిక్ లోని 27 ఏళ్ల మహిళ ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ తో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను హెలికాప్టర్ అంబులెన్స్ లో బ్రూనో యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను బతికించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ బ్రెయిన్ డెడ్ కావడంతో చేతులెత్తేశారు. అదే సమయంలో ఆమె కడుపులో మరో జీవం ప్రాణం పోసుకుంటున్న సంగతి గుర్తించారు.

తల్లిని బతికించలేకపోయినా ఆ శిశువునైనా బతికించాలని భావించారు. 15 వారాల వయసున్న ఆ పిండానికి ప్రాణం పోయాలని గట్టిగా సంకల్పించుకున్నారు. అంటే తమ వైద్య పరిజ్ఞానాన్నంతా రంగరించారు. బ్రెయిన్ డెడ్ అయిన తల్లికి వెంటిలేటర్ సపోర్ట్ అమర్చారు. పిండం శిశువుగా రూపుదిద్దుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టారు. అలా 117 రోజుల పాటు అలుపెరగని కృషి చేశారు. అనంతరం గతనెల 15వ తేదీన సిజేరియన్ చేసి పండంటి ఆడబిడ్డను బయటకు తీశారు.

తర్వాత తల్లికి అమర్చిన లైఫ్ సపోర్ట్ తొలగించారు. ప్రస్తుతం ఆ శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉందని తాజాగా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గర్భంలో ఇన్ని రోజులపాటు శిశువును బతికించి ఉంచడం రికార్డు అని పేర్కొన్నాయి. వైద్యులు దేవుడితో సమానం అని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...