Switch to English

చంద్రయాన్‌-2: ఈ ఫెయిల్యూర్‌ ఎంత కఠినం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాకెట్లను మొదట్లో సైకిళ్ళ మీద తీసుకెళ్ళాం.. శాటిలైట్లను ఎడ్ల బళ్ళలో తరలించాం.. ఆ స్థాయి నుంచి, ఇప్పుడు ఏ స్థాయికి మన అంతరిక్ష ప్రయోగాలు ఎదిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి. తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో ‘ఇస్రో’ దిట్ట.. అని ప్రపంచ దేశాలు మనల్ని కొనియాడుతున్న వేళ, అనూహ్యంగా పెద్ద షాక్‌ తగిలింది చంద్రయాన్‌-2 ప్రాజెక్టు చివరి దశలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా.

అన్నీ సక్రమంగా జరిగి వుంటే, ఇప్పుడంతా ప్రపంచం, ఇస్రోని కీర్తిస్తూ వుండేది. కానీ, చిన్న సాంకేతిక లోపం.. పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ‘మీరు సాధించినది తక్కువేమీ కాదు.. ముందు ముందు మీ నుంచి అద్భుతాల్ని చూడబోతున్నాం..’ అని ఒక్క పాకిస్తాన్‌ మినహా, ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి. నిజానికి, నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకూ ఎవరూ నిద్రపోలేదు. కులమతాలకతీతంగా 130 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు.

ప్రపంచ దేశాలూ చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఆఖరి దశ విజయవంతమవ్వాలని ఆకాంక్షించాయి. కానీ, సాంకేతిక లోపం భారత విజయాన్ని 2 కిలోమీటర్ల దూరంలో ఆపేసింది. విజయం సాధించలేదంటే, పరాజయం పాలయ్యామని కానే కాదు. దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది చంద్రయాన్‌ ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్‌లో కీలక బాగమైన విక్రమ్‌ ల్యాండర్‌, చంద్రుడి మీదకు దిగే క్రమంలో కేవలం 2 కిలోమీటర్ల దూరంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.

ప్రయోగం సక్సెస్‌.. అని చెప్పాలనుకున్న ఇస్రో శాస్త్ర వేత్తలకు జస్ట్‌ కొద్ది సెకెన్ల ముందు తీవ్ర నిరాశను మిగిల్చింది. ‘ఏమో, కమ్యూనికేషన్‌ మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుందేమో..’ అని ఎదురుచూశారు. కానీ, ఫలితం ‘నెగెటివ్‌’ అని తేలిపోయింది. క్రాష్‌ ల్యాండ్‌ అయ్యిందా.? ఇంకేమైనా జరిగిందా.? అన్నదానిపై సమాచారం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కమ్యూనికేషన్‌ తెగిపోవడమంటే, ప్రాజెక్టు ఫెయిల్‌ అయినట్లే లెక్క.

కానీ, చంద్రయాన్‌-2 పూర్తిగా ఫెయిల్‌ అయ్యిందని అనడానికి వీల్లేదు. చంద్రునికి చాలా చాలా దగ్గరగా వెళ్ళాం. ఇంకా చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆర్బిటర్‌, చందమామకి దగ్గరి కక్ష్యలోనే తిరుగుతోంది. నిజానికి, ఇది ఓటమి కానే కాదు.. ఇదొక అనుభవం అంతే. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో వైఫల్యాల్ని చూశాయి అంతరిక్ష ప్రయోగాల్లో. వ్యోమగాముల్ని కోలల్పోయిన సందర్భాల్ని చూశాం. వాటితో పోల్చితే, ఇదసలు వైఫల్యమే కాదన్నది నిర్వివాదాంశం.

Also Read: ఆఖరి మెట్టుపై ఆగిపోయింది.. !

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...