వైఎస్ వివేకా హత్య కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ కావడం సీఎం జగన్ కు చెంపపెట్టు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని విజయరాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘వివేకా హత్య కేసులో దోషులెవరో తేలాలి. ఈ విషయంలో జగన్ ఎందుకు మాట్లాడటం లేదు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడిది. ఎన్నికల సమయంలో ముద్దు పెడుతున్నాడని మోసపోవద్దు.. తర్వాత పిడిగుద్దులు ఉంటాయని చెప్పా.. అమరావతి ఉండదు పోలవరం ముంచేస్తాడని చెప్పా.. అదే జరుగుతోంది.’
‘టీడీపీ హయాంలో 72శాతం పోలవరం పనులు జరిగాయి. గేట్లు పెట్టేవరకూ వచ్చాం. జగన్ వచ్చాక డబ్బులు కోసం కంట్రాక్టర్లను మార్చేశారు. ఇప్పుడున్న మంత్రికి డయాఫ్రం వాల్ అంటే తెలీదు.. పోలవరం పూర్తి కాకపోవడానికి నేను కారణమంటున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి. ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడైనా నా మాట వింటారనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని అన్నారు.
రెస్ట్ తీసుకో చంద్రన్న