నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫ్లో లో ఉన్నాడు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి… ఇలా మూడుకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు బాలయ్య. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
భగవంత్ కేసరిలో వయసుకు తగిన పాత్రను చేసాడు బాలయ్య. సో, హీరోయిన్ తో రొమాన్స్, మాస్ స్టెప్స్… ఇలాంటి వాటికి అవకాశం రాలేదు. అయితే బాబీ సినిమాతో ఆ లోటుని భర్తీ చేస్తాడట బాలయ్య. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట. ఊర్వశి రౌటేలా, మీనాక్షి చౌదరిలను ఇప్పటికే ఫైనలైజ్ చేసేసారు. మూడో హీరోయిన్ ను త్వరలోనే తీసుకుంటారని సమాచారం.
మొత్తం ఐదు పాటలుండే ఈ సినిమాలో ఏకంగా మూడు మాస్ బీట్స్ అని తెలుస్తోంది. మొత్తానికి మరోసారి బాలయ్య మాస్ అవతారం ఎత్తబోతున్నాడు.