Switch to English

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్కెచ్ ఇదీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దేశంలో తిరుగులేని మెజార్టీతో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ.. క్రమంగా దక్షిణాదిపై తన పట్టు బిగిస్తోంది. ఒకప్పుడు కేవలం ఉత్తర భారతానికి మాత్రమే పరిమితమైన బీజేపీ.. నెమ్మదిగా దక్షిణాదికీ విస్తరిస్తోంది. కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ఇందుకు తగ్గట్టుగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ చెప్పుకోతగ్గ సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభావం ఉన్నప్పటికీ.. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మాత్రం ప్రాంతీయ పార్టీలకే సై అన్నాయి.

తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందు మోదీ ప్రభావం నిలవలేకపోయింది. అయితే, 2019కి వచ్చేసరికి పరిస్థితి మారింది. అటు బెంగాల్, ఇటు తెలంగాణలోనూ బీజేపీ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక బెంగాల్ లో అయితే 2 సీట్ల నుంచి ఏకంగా 18 స్థానాలను ఎగబాకింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఎదగాలనే తలంపు కమలనాథుల్లో మొగ్గ తొడిగింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ కొడిగడుతున్న నేపథ్యంలో తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న తాము.. రెండో స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే తగిన వ్యూహం రెడీ చేసినట్టు సమాచారం. ముందుగా తెలంగాణలో అధికార పార్టీకి ధీటుగా ఎదిగడానికి 2024లో అధికారం చేజిక్కించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంట్రీతో లబ్ధి పొందారు. బాబు వస్తే మళ్లీ ఏమైపోతుందనే భయంతో ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి పరిస్ధితి మారిపోయింది. 16 సీట్లూ గెలుచుకోవాలన్న కేసీఆర్ వ్యూహానికి ప్రజలు చెక్ పెట్టారు. కేవలం 9 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. అనూహ్యంగా బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడం కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నింపింది. దీంతో తెలంగాణలో మరింత బలపడే యోచనతో ముందుకెళ్తున్నారు.

ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను తన వైపు తిప్పుకునే పనికి కాషాయదళం శ్రీకారం చుట్టింది. ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉండిపోయిన టీడీపీ నేతలతోపాటు అధికార పార్టీకి చెందినవారిని సైతం ఆకర్షించడం ద్వారా తెలంగాణలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుకానుందని సమాచారం. మరోవైపు ఏపీపైనా కమలనాథుల కన్ను పడింది. అక్కడ అధికారంలోకి వచ్చేంత స్థాయి ప్రస్తుతం లేకపోయినా.. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ఆలోచనలు చేస్తోంది.

ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీని నిర్వీర్యం చేయాలన్నది బీజేపీ ప్లాన్ గా చెబుతున్నారు. తద్వారా ఖాళీ అయిన స్థానాన్ని తాము భర్తీ చేయాలన్నది కమలనాథుల వ్యూహం అని అంటున్నారు. అనంతరం కేసులతో జగన్ ను ఇరుకున పెట్టి రాజకీయంగా లాభం పొందే కార్యాచరణను బీజేపీ అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. మరి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేయబోయే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...