Switch to English

బూతులు తగ్గించుకోవాల్సిందే.! కానీ, తగ్గించాల్సిందెవరు బిగ్ బాస్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లోనే కాదు, బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా బూతులు ఎక్కువైపోయాయ్. ఎడిటింగ్‌లో కొన్ని బూతులు మిస్ అవుతున్నాయ్.. కానీ, కొన్ని బూతుల్ని వీక్షకలు సౌలభ్యం కోసం వదలుతున్నట్టున్నారు.! ఇదీ నిన్నటి ఎపిసోడ్ తర్వాత చాలామంది బిగ్ బాస్ వ్యూయర్స్‌కి అర్థమయిన విషయం.

నామినేషన్ల వ్యవహారంలో ఎవరికి వారు వీరావేశానికి లోనయ్యారు. టాప్ టెన్ కంటెస్టెంట్ల మధ్య పోరు కదా.! ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలా.? పైగా, ఎలిమినేషన్ కోసం నామినేషన్ అంటే, సిల్లీ రీజన్స్ వెతుక్కుంటూ ముందే సిద్ధమైపోతారు కంటెస్టెంట్లు.

ఈగో ఫైట్స్, బూతుల పర్వం, అనవసరమైన ఆవేశాలు.. వీటికి తోడు సిల్లీ రీజన్స్ వుండనే వుంటాయ్. వెరసి, వ్యవహారం హాట్ హాట్‌గా నడిచింది. కెప్టెన్ ఫైమా నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. బూతులు మాట్లడేస్తున్నావ్.. అంటూ రోహిత్ మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయ్. ఆ బూతుల ఆరోపణలు ఇనాయా మీద కూడా వచ్చేశాయ్. అందరూ కలిసి ఈ బూతు వీరుడు, బూతు వీర వనితకి క్లాస్ తీసుకున్నారు.

మరోపక్క, నేనూ హౌస్ నుంచి వెళ్ళిపోతానేమో.. అంటూ ఆది రెడ్డిలో గుబులు బయల్దేరింది. రేవంత్ యాజ్ యూజువల్ సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. గీతూ రెండు వారాల క్రితమే వెళ్ళిపోయింది కదా.. దాంతో, ఆ ‘గడబిడ’ లేకపోవడాన్ని బిగ్ బాస్ వీక్షకులు ఫీల్ అవుతున్నారు.. అది కూడా, ‘హమ్మయ్యా..’ అనుకునేంతలా.

ఇంతకీ, ఈ వారం వికెట్ ఎవరిది.? ముందు ముందు టాస్క్‌లు నడవబోతున్నాయ్. వాటి ద్వారా కొందరికి వీకెండ్ ఎపిసోడ్ కంటే ముందే ఇమ్యూనిటీ లభించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

అంతా బాగానే వుందిగానీ, బిగ్ బాస్ ఎందుకు బూతుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు.? అది లేకపోతే ‘షో’లో మజా వుండదని బహుశా బిగ్ బాస్ అనుకుంటున్నాడేమో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...