Switch to English

Bichagadu 2 Pre Release Event: ‘బిచ్చగాడు 2’ కోసం వాళ్లిద్దరూ ప్రాణం పెట్టారు: అడివి శేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Bichagadu 2 Pre Release Event: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. విజయ్ ఆంటోనీకి జోడిగా ఈ సినిమాలో కావ్యా థాపర్ నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్, వీరనాయుడు సంయుక్తంగా మే 19న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్‌, ఆకాష్ పూరిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో

అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మనమే కథలు రాస్తున్నాం.. మనమే సినిమాలు చేస్తున్నామని అని అనుకున్నాను. కానీ విజయ్ గారు మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా చేస్తున్నారు. బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని విజయ్ సర్ ఫోన్ చేశారు. వచ్చే ఐదు రోజుల్లో ఐదు డిఫరెంట్ సిటీల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఉషా పిక్చర్స్ నాయుడు గారికి థాంక్స్. సురేష్‌ గారు నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా ఉన్నారు. బిచ్చగాడు సినిమాలో నెంబర్ ప్లేట్ సీన్ నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ప్రాణం పెట్టి అందరూ చెబుతుంటారు. కానీ ఫాతిమా గారు, విజయ్ గారు నిజంగానే ప్రాణం పెట్టారు. కావ్య తెలుగులో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.

ఆకాష్‌ పూరి మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు సినిమా టైటిల్ వినగానే ఇదేం టైటిల్ అనుకున్నా. కానీ ఆ సినిమా ఓ చరిత్రను సృష్టించింది. చిన్న సినిమాలకు బిచ్చగాడు ఫ్లాట్‌ఫాంలా మారింది. ఈ సినిమా ఎంతో మందికి కాన్ఫిడెంట్‌ ఇచ్చింది. విజయ్ ఆంటోని ని ఇంత వరకు ప్రేమిస్తూ వచ్చాను. కానీ ఆయన్ను కలిశాక గౌరవించడం ప్రారంభించాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి థాంక్స్. అడివి శేష్‌ గారి గూఢచారి చిత్రం తీయడం ఎంతో కష్టం. ఆయనతో కలిసి ఇలా స్టేజ్ పంచుకోవడం ఆనందంగా ఉంది. కమర్షియల్ సినిమాలు తీయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ పూరి జగన్నాథ్ గారు అద్భుతంగా తీస్తుంటారు. ఆయన కొడుకు ఆకాష్ పూరిని ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న వీరమనాయుడు, విజయ్ గారికి థాంక్స్. పెళ్లి చేసి అమ్మాయిని మెట్టింటికి పంపిస్తుంటే.. తండ్రి బాధపడుతుంటాడు. ప్రతీ సినిమా విషయంలో మేం కూడా భయపడుతుంటాము. కానీ మా డిస్ట్రిబ్యూటర్లు వీరమనాయుడు, ఉషా పిక్చర్స్‌ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో నాకు ఎలాంటి భయం లేదు. భాషా శ్రీ గౌరవ్ నా ఆలోచనలన్నీ తెలుగులో చక్కగా చెబుతుంటారు. నన్ను ప్రమాదం నుంచి కాపాడిన కావ్యకు థాంక్స్. నా తప్పు వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. అన్ని రకాలుగా ఎంతో అండగా ఉంటున్న నా భార్య ఫాతిమాకు థాంక్స్. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రెండో పార్ట్‌లోనూ ఉంటాయి. బిచ్చగాడు మొదటి పార్ట్ నచ్చిన అందరికీ కూడా రెండో పార్ట్ నచ్చుతుంది. మే 19న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.

ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘విజయ్ ఆంటోనికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ వస్తుంది. బిచ్చగాడు సినిమాను పెద్ద హిట్ చేశారు. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కూడా ఆయన్ను ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. నకిలీ సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. వీరనాయుడు మాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఉషా పిక్చర్స్, వీరమనాయుడు కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన విజయ్ ఆంటోనీయే చూసుకున్నారు. సంక్రాంతి రోజు మలేషియాలో షూటింగ్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని మేనేజర్ కాల్ చేసి మాట్లాడారు. మేడం యాక్సిడెంట్ అయింది.. సర్‌కి స్పృహ కూడా లేదు అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ టైంలో సోషల్ మీడియా నుంచి అభిమానుల ప్రేమ నాకు అందింది. ఆయన తిరిగి వస్తారనే నమ్మకాన్ని అభిమానులు నాకు ఇచ్చారు. అభిమానుల ప్రేమ వల్లే మేం ఇలా బతికి ఉన్నాం. బాధలన్నీ తొలిగిపోయాయ్ ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతోంది. అంతా సంతోషంగా ఉంది. ఇంత గొప్పగా ఈవెంట్‌ను ప్లాన్ చేసినందుకు థాంక్స్. మే 19న థియేటర్లోనే ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ విజయ్ మాట్లాడుతూ.. ‘మా నాన్న బాలకృష్ణ గారు ఇప్పటికీ కళామతల్లిని నమ్ముకుని ఉన్నారు. ఈ 49 ఏళ్లలో 2200 పైచిలుకు సినిమాలు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లకు ఎక్కారు. ఎంతో మంది అండతో ఈ స్థాయికి మేం ఎదగగలిగాం. మాకు సహకరించిన అందరికీ థాంక్స్. 1995లో విజయ్ ఆంటోనీ గారు ఓ బాయ్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత టెక్నీషియన్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో హిట్స్ ఇచ్చారు. హీరో అవ్వాలని అనుకుంటున్నాను అని చెబితే హేళన చేసేవారట. కానీ ఆయన ఇప్పుడు ఎంతో పెద్ద హీరో అయ్యారు. మా మీద నమ్మకంతో బిచ్చగాడు 2 సినిమాను మాకు ఇచ్చిన విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

కావ్యా థాపర్ మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు 2 సినిమా మే 19న రాబోతోంది. విజయ్ గారు ఎంతో నొప్పిని భరిస్తూ కూడా పాట పాడారు. ఆయన కోసమే వచ్చి డ్యాన్స్ చేశాను. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న ప్రతీ సీన్‌లోనూ ఎంతో నేర్చుకున్నాను. ఆయన నాకు ఓ మంచి స్నేహితుడు. హేమ పాత్రను నాకు ఇచ్చినందుకు థాంక్స్. ఫాతిమా మేడం, విజయ్ సర్‌కు థాంక్స్’ అని అన్నారు.

లిరిక్ రైటర్ భాషా శ్రీ మాట్లాడుతూ.. ‘2016లో బిచ్చగాడు రిలీజ్ అయింది. ఆ సినిమా తెలుగులో రికార్డులు బద్దలు చేసింది. బిచ్చగాడు 2 మీరు ఊహించిన దాని కంటే పది రెట్లు ఉంటుంది. మొదటి పార్ట్‌కు మాటలు, పాటలు రాశాను. ఈ రెండో పార్ట్‌కూ రాశాను. త్వరలో మూడో పార్ట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...