2020 లో సినిమా పరిశ్రమ వరుస విషాదాలను చవి చూస్తూనే ఉంది. ఇండియన్ సినిమా పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఇప్పటికే ఈ ఏడాదిలో తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది ముగియబోతుంది. ఇక పై అయినా ఈ విషాదాలు ఆగుతాయని అంతా ఆశిస్తున్న సమయంలో మరో నటుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం సమయంలో మలయాళ నటుడు అనిల్ నేదుమంగడ్ ప్రమాదవశాత్తు నీట మునిగి కన్నుమూశారు. ప్రస్తుతం పవన్, రానాలు రీమేక్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా ఒరిజినల్ వర్షన్ లో సీఐ పాత్రలో అనీల్ నటించాడు.
టెలివిజన్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనిల్ కెరీర్ లో చాలా కష్టపడి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తింపు స్టార్ డం వస్తున్న సమయంలో అనూహ్యంగా ఇలా జరగడం ఇండస్ట్రీ వర్గాలకు ఆవేదన కలిగిస్తుంది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం తొడుపుడ వెళ్లిన అనిల్ అక్కడ ఇతర యూనిట్ సభ్యులతో కలిసి మళంకర రిజర్వాయర్ స్నానంకు వెళ్లాడు. ఆ సమయంలో నీటిలోకి జారిన అనీల్ 30 నిమిసాల పాటు కనిపించలేదు. ఆ తర్వాత అనిల్ శవమై కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
814016 435909This really is a excellent topic to talk about. Normally when I locate stuff like this I stumble it. This write-up probably wont do effectively with that crowd. I is going to be positive to submit something else though. 276525
283333 311783You produced some decent points there. I looked on the net towards the issue and discovered many people goes together with along with your site. 813103