Switch to English

ఏపీ సర్కారుకి ‘పవర్’ షాక్: 9 వేల కోట్లు కట్టాల్సిందేనన్న హైకోర్టు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థల (పవన విద్యుత్, సౌర విద్యుత్) విషయమై వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పెద్ద యాగీనే జరుగుతోంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రానికి నష్టమొస్తోందన్నది వైసీపీ ఆరోపణ. కాదు మొర్రో.. అది కేంద్రం కనుసన్నల్లో జరిగిన ఒప్పందాల వ్యవహారమని టీడీపీ వాదిస్తోంది. ఎవరి గోల వారిదే.!

నిజానికి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి విషయమై జాతీయ విధానమొకటి ఏడ్చింది. నరేంద్ర మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆయా రాష్ట్రాలు, తమ రాష్ట్రాల అవసరాల మేర ఆయా విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పాతికేళ్ళ కాల పరిమితితో కూడిన ఒప్పందాలవి.

అన్నిటా రివర్స్ టెండరింగ్.. అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చిన వైఎస్ జగన్ సర్కార్, ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా అదే బాట పట్టింది. ఈ క్రమంలో వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. తొలుత పరిస్థితి కొంత సానుకూలంగానే కనిపించింది జగన్ సర్కారుకి. దాంతో, తమ వాదనే కరెక్ట్.. అంటూ విర్రవీగింది.

అయితే, విద్యుత్ ఒప్పందాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి వీల్లేదనీ, పాతికేళ్ళ కాల పరిమితి కోసం జరిగిన ఒప్పందాల్ని వున్నపళంగా ఎలా రద్దు చేసుకుంటారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మొత్తం బకాయిలు దాదాపు 9 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఒప్పందాలను గౌరవించకుండా, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు నిలిపివేయడమో, ఒప్పందాలను రద్దు చేసుకోవడమో, యూనిట్ ధర తగ్గించేసుకుంటామనడమో సబబు కాదన్నది హైకోర్టు తాజాగా వెల్లడించిన తీర్పు సారాంశం.

ఈ లెక్కన మొత్తం బకాయిలు దాదాపు ఏడున్నర వేల కోట్లు కాగా, వడ్డీతో కలుపుకుని మొత్తంగా 9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వంలో వున్నవారు ప్రయోగాలు చేస్తే, ఆ ప్రయోగాలు వికటించినప్పుడు ప్రజలపై పడే ఆర్థిక భారం మాటేమిటి.?

ఈ తరహా సందర్భాల్లో జరీమానాలు, వడ్డీ భారాలు లాంటివి అధికారంలో వున్నవారి వ్యక్తిగత ఆస్తుల నుంచి వసూలు చేసేలా చట్టాల్లో మార్పులు జరిగితే బావుంటుందేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...