టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనుకోని విధంగా అనిల్ రావిపూడి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన సీక్రెట్‌గా సినిమా ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారా? దానికి సంబంధించిన టీజర్ అదేనా..లేక అనిల్ రావిపూడి యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారా అనేలా ఆ వీడియో ఉంది. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
వీడియో చాలా గ్రాండ్‌గా ఉంది. ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కెమెరాను చూస్తూ అనీల్ రావిపూడి చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. మేకింగ్‌కి సంబంధించిన సలహానిస్తున్నారు. ఈ వీడియోలో ఆయనొక రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించారు. ఇది అందరిలో గందరగోళాన్ని కలిగిస్తూనే నెట్టింట చాలా వేగంగా వైరల్ అవుతుంది.
ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ వీడియోలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారనే దానిపై స్పష్టత లేదు. అయితే ప్రేక్షకులు ఈ వీడియో వెనుకున్న రహస్యాన్ని కనుగొనాలనే ఆసక్తితో ఉన్నారు. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాతో అనిల్ రావిపూడి పొలిటికల్ మూవీని చేస్తున్నారా లేక ఆహా నిర్మాణంలో అనిల్ రావిపూడి నటించబోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది.