Switch to English

అనసూయ ‘ఆంటీ’ గోల: ఎన్ని అరెస్టులు జరుగుతాయో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ఒకటా.? రెండా.? యాభై వేలకు పైగా ట్వీట్లు.. ఇది కేవలం ట్విట్టర్ హంగామా మాత్రమే.! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల సంగతి వేరు. ఇదంతా కేవలం ‘ఆంటీ’ చుట్టూ జరుగుతున్న గోల.! ‘లైగర్’ సినిమా విషయంలో అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే ‘ఉసురు’ అంటూ వ్యాఖ్యానించిందో, ఆ తర్వాతి ను రచ్చ షురూ అయ్యింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు, బ్యాక్ టు బ్యాక్ అనసూయ ట్వీట్లేస్తూనే వుంది.. దానికి తగ్గట్టుగా నెటిజన్లూ పెద్దయెత్తున ఆ ట్వీట్లపై స్పందిస్తూనే వున్నారు.

అసలెందుకిదంతా.? అన్నది ఓ చర్చ. అనసూయ ఆవేదనలో కొంత వాస్తవం వుంది. అదే సమయంలో ఆమె చేస్తున్నది కేవలం పబ్లిసిటీ స్టంట్.. అనే విమర్శ కూడా లేకపోలేదు. ఎవరి గోల వారిది. ‘ఏజ్ షేమింగ్’ అంటోంది అనసూయ. నిజమే, ‘ఆంటీ’ అంటూ ఆమెను వెటకారం చేయడమేంటి.? పిల్లల్ని వివాదంలోకి లాగడమేంటి.? భర్త మీదా బాడీ షేమింగ్ చేయడమేంటి.? నిజమే, ఆన్‌లైన్ అబ్యూజ్ అనేది సమర్థనీయం కాదు.

కానీ, నెటిజనం సంధిస్తున్న బూతులతో కూడిన ట్వీట్లను ప్రస్తావిస్తూ, వాటి మీద మళ్ళీ ట్వీట్లేయడం ఎంతవరకు సబబు.? అన్నదానిపై అనసూయ భరద్వాజ్ తనను తాను ప్రశ్నించుకుంటే మంచిది. కేసులు పెడతా.. అని బెదిరించడం కంటే, ఆ పనేదో చేసేస్తే.. ఇలాంటి చెత్త ట్వీట్లు వేసేవాళ్ళు ఒకింత భయపడతారేమో.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ‘సోషల్ అబ్యూజ్’ అనేది క్యాన్సర్ కంటే దారుణంగా తయారైంది. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులే ఈ సోషల్ అబ్యూజ్‌కి అతీతం కానప్పుడు, సెలబ్రిటీలు ఏం చేసినా.. ఫలితం వుంటుందని ఎలా అనుకోగలం.? ఏపీ, తెలంగాణల్లోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులపైనా, సినీ ప్రముఖులపైనా నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంటుంది. అడపా దడపా అరెస్టులు జరుగుతూనే వుంటాయ్. దీన్ని ఆపడం సాధ్యం కాదు కూడా.

అనసూయ గతంలోనూ ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంది.. అప్పట్లోనూ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇప్పుడు వీలైనంత ఎక్కువ ‘స్పేస్’ ఇచ్చి, ఎక్కువమందిపై ఫిర్యాదు చేయాలని అనసూయ అనుకుంటోందిట. అంటే, బోల్డన్ని అరెస్టులు జరుగుతాయనీ భావించొచ్చేమో.

సినిమాల్లో అయినా, ‘పాత్రలు కల్పితం’ అని చెప్పి, ఎవరో ఒకర్ని టార్గెట్ చేసుకుని ఆయా పాత్రల్ని అత్యంత జుగుప్సాకరంగా చూపించడంలేదా.? అలాంటి పాత్రల్లో నటిస్తోన్న సెలబ్రిటీలను ఏమనాలి.? వారిపైనా కేసులు నమోదు చేయాల్సి వస్తే.? ‘అబ్బే, అది నటన మాత్రమే..’ అని తప్పించుకోవడం సోకాల్డ్ సెలబ్రిటీలకు అలవాటైపోయింది.

సమంత మీద ఎంత దారుణమైన ట్రోలింగ్ జరిగింది.. నిహారిక మీద ఎంతటి పైత్యం ప్రదర్శించబడింది.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా చాలా చాలా పెద్దదే. ఆ మాటకొస్తే, ట్రోలింగ్ బారిన పడని నటి, నటుడు, రాజకీయ నాయకుడు, దర్శకుడు, నిర్మాత.. వుండరనడం అతిశయోక్తి కాదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...