Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 02 నవంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:02
సూర్యాస్తమయం: సా‌.5:22
తిథి: ఆశ్వీయుజ బహుళ ద్వాదశి ఉ.8:22 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం:భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము:ఉత్తర ఉ.9:45 వరకు తదుపరి హస్త
కరణం: తైతుల ఉ.8:22 వరకు తదుపరి గరజి
యోగం: వైధృతి రా.7:32 వరకు తదుపరి విష్కంభం
వర్జ్యం: సా.5:55 నుండి 7:28 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:22 నుండి 9:07 వరకు తదుపరి రా.10:29 నుండి 11:07 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : ఉ.11:59 నుండి మ. 1:24 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:42 నుండి తె.5:30 వరకు
అమృతఘడియలు: మ.3:15 నుండి 4:48 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:36. నుండి 12:22 వరకు

ఈరోజు (02-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

వృషభం: వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన శిరోభాధలు తప్పవు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిథునం: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారభించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగస్తులు పనిఒత్తిడి నుండి బయటపడతారు.

కర్కాటకం: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

సింహం: ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు.

కన్య: దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

తుల: చాలా కాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి.నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.

ధనస్సు: జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడాలి.

మకరం: వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం వృధాగా మిగులుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

కుంభం: సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.

మీనం: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...