సోమవారం అనేది బిగ్ బాస్ కు చాలా కీలకం. ఇంటి నుండి బయటకు పంపడానికి హౌజ్ మేట్స్ ఒకరినొకరు సోమవారం నాడే నామినేట్ చేస్తారు. ఈ నామినేషన్స్ ప్రాసెస్ ఎక్కువగా ఫుల్ ఫైర్ తో జరుగుతూ ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ కూడా వాదనలతో, గొడవలతో జరిగింది. ఇప్పటిదాకా అటూ ఇటూగా ఉన్న వారి మధ్య ఈ నామినేషన్స్ ప్రాసెస్ వల్ల అగాధం ఏర్పడింది.
ఈరోజు నామినేషన్స్ ప్రాసెస్ లో భాగంగా ఇంటి నుండి బయటకు పంపడానికి ఒక్కో హౌజ్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది. నామినేట్ చేస్తూ సరైన కారణం చెప్పి మోహన్ ఫోమ్ కొట్టాలి. ఈ ఎపిసోడ్ అంతా ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ ఆసక్తికరంగా మార్చారు.
ఒక్కో హౌజ్ మేట్ ఎవరిని నామినేట్ చేసారంటే..
మానస్ – శ్రీరామ్, జెస్సీ
సిరి – సన్నీ, ఎన్నీ
శ్రీరామ్ – సన్నీ, మానస్
రవి – మానస్, కాజల్
జెస్సీ – సన్నీ, మానస్
ప్రియాంక – విశ్వ, రవి
సన్నీ – సిరి, జెస్సీ
విశ్వ – ప్రియాంక, మానస్
కాజల్ – రవి, శ్రీరామ్
ఎన్నీ – సిరి, కాజల్
షణ్ముఖ్ – మానస్, ప్రియాంక
శ్రీరామ్, కాజల్ ల మధ్య ఉన్న గ్యాప్ ఈ నామినేషన్స్ ప్రాసెస్ తో మరింతగా పెరిగింది. ఒకరినొకరు వాదించుకుంటూ గొడవను మరింత పెద్దది చేసారు. రవి, కాజల్ ల మధ్య గొడవ కూడా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. అదే నామినేషన్స్ లోకి కూడా వచ్చింది. ఇక సంచాలక్ గా జెస్సీ ఫెయిల్ అయ్యాడని చెప్పి మానస్, సన్నీ ఇద్దరూ కూడా జెస్సీను నామినేట్ చేసారు. ఇక జెస్సీకు ఉన్న అనారోగ్యాన్ని సన్నీ సరిగా అర్ధం చేసుకోకుండా కామెంట్ చేయడం అనేది జెస్సీ, సిరికు నచ్చలేదు. దానికి తగ్గట్లుగానే నామినేషన్స్ చేసారు. ప్రియాంక ప్రతీసారి కోపం తెచ్చేసుకుని అక్కడి నుండి ఏదో ఒకటి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోవడం ఈసారి కూడా కొనసాగింది. మొత్తమ్మీద ఈసారి నామినేషన్స్ లో ఒక్క షణ్ముఖ్ తప్ప అందరూ ఉన్నారు. మానస్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, కాజల్, సిరి, జెస్సీ, రవి, ప్రియాంక, ఎన్నీ, విశ్వలు ఉన్నారు. అయితే వీరిలో ఒకరికి సేవ్ అయ్యే అవకాశముంది. అది ఎవరో రేపు ఎపిసోడ్ లో తెలుస్తుంది.
142693 45244Some genuinely wonderful information , Gladiola I detected this. 657833
25919 48895If I need to say something, then absolutely nothing will stop the chatter within 382859