Switch to English

ఓడి గెలిచిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడిపోయి, మంత్రి పదవులు తీసుకున్నోళ్ళున్నారు.. గెలిచి, ఏమీ చేయలేక ఇంటికెళ్ళి ఏడ్చినోళ్ళూ వున్నారు. సో, ఎవరు గెలిచారు.? ఎవరు ఓడారు.? అన్నదానిపై ఎవరికి ఇష్టమొచ్చిన చర్చ వారు చేసుకోవచ్చన్నమాట. అంతిమంగా అధికారంలో ఎవరుంటే, వాళ్ళు గెలిచినట్టని ఇప్పుడున్న రాజకీయ సూత్రాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ, గెలుపు అంటే అది కాదు. ఓడినా, జనం మనసుల్ని గెలవడం నిజమైన గెలుపు. ఈ విషయంలో జనసేనాని నిజంగానే గెలిచాడు.

పోటీ చేసిన రెండు చోట్లా (గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో) పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయినా, ఆయన్ని ‘పరాజితుడు’ అని ఎవరూ అనలేని పరిస్థితి. ‘పవన్‌ కళ్యాణ్‌ గెలిచి వుంటే బావుండేది’ అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోందంటే ఆయన గెలిచినట్టే కదా.! చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేశారు. ఓ చోట ఓడి, ఇంకో చోట గెలిచారు. ‘రెండు చోట్లా గెలిచి వుంటే బావుండేది’ అని అప్పట్లో అన్నవాళ్ళు చాలా తక్కువమందే.

చిరంజీవితో పోల్చితే, పవన్‌కళ్యాణ్‌ తన పార్టీతో సాధించిన ఓట్ల శాతం కూడా తక్కువ. అయినాగానీ, పవన్‌కళ్యాణ్‌ గెలిచాడు, జనం మనసుల్లో ఇప్పుడు కొలువు దీరాడు. చిరంజీవిని ఓడించేందుకు అప్పట్లో జరిగిన కుట్రలతో పోల్చితే, పవన్‌ కళ్యాణ్‌ని ఓడించేందుకు ఇప్పుడు జరిగిన కుట్రలు చాలా చాలా ఎక్కువ. డబ్బు, మద్యం ఏరులై పారాయి, జనసేనానిని ఓడించేందుకోసం. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న మాట ఇది.

జనసేనకు సంబంధించి కొన్ని వైఫల్యాలు వున్న మాట వాస్తవం. కానీ, అవి పవన్‌ని ఓడించేంతటి పెద్దవి కావు. తెలుగుదేశం పార్టీకి చెంచాగిరీ చేస్తున్నారంటూ పవన్‌ కళ్యాణ్‌ మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రచారం, జనసేన మీద తీవ్ర ప్రభావం చూపింది. ‘మావాడే..’ అని టీడీపీ నేతలు చెప్పుకోవడం అటు టీడీపీని ముంచేయడమే కాక, జనసేనని కూడా దెబ్బతీసింది. ఇలాంటి ఈక్వేషన్స్‌ ఎన్ని వున్నా, జనసేనాని గెలిచేవాడే. కానీ, ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా ‘డబ్బు, మద్యం’ ప్రభావం చూపాయి. ఆయా నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలే కాదు, సాధారణ ప్రజానీకం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘ఓటర్లు అమ్ముడుపోయారు’ అనడం సబబు కాదని గెలిచినోడు చెప్పడం మామూలే. కానీ, జనసేన అభ్యర్థుల్లా ‘మేం డబ్బు ఖర్చుపెట్టలేదు.. గెలవడానికి అడ్డదారులు తొక్కలేదు..’ అని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలిగే ధైర్యమెవరికి వుంది.? ”ఓడిపోయినందుకు బాధపడ్డంలేదు. గెలిచేదాకా, పోరాటం చేయడమే జనసేన నినాదం. ఓటమి గెలుపుకి తొలి మెట్టు. మేం ప్రజల కోసం, ప్రజల తరఫున రాజకీయాలు చేస్తున్నాం. అంతిమంగా మేం గెలిపించాలనుకుంటున్నది ప్రజల్ని. అదే జనసేన గెలుపు. ఆ మార్పు కోసం మా ప్రయాణం, పోరాటం కొనసాగుతూనే వుంటాయి” అని జనసేనాని పవన్‌కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలతో జిల్లాల వారీ సమీక్షల సందర్భంగా వ్యాఖ్యానిస్తుండడం, ఆయన గుండె ధైర్యానికి నిదర్శనం.

ప్రస్తుతం జనసేన పార్టీకి వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. కానీ, లక్షలాది మంది ప్రజలున్నారు జనసేన తరఫున. జనసేనకు ఓటు వేసినవారే వాళ్ళంతా. సమస్య ఎక్కడుంటే పరిష్కారం చూపేందుకు, ఆ సమస్యనెదుర్కొంటున్న ప్రజల తరఫున పోరాడేందుకు జనసేన వుంటుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన దరిమిలా, రాష్ట్రంలో ఇకపై ఆంధ్రప్రదేశ్‌ అంతటా జనసేన జెండా రెపరెపలాడబోతోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బలమైన మార్పు కోసం తన ప్రయాణాన్ని మరింత ఉధృతం చేయబోతోంది.

Related Posts

జనసేనానికి ‘మెగా’ గైడెన్స్‌ షురూ

పవన్‌కళ్యాణ్‌ ఈజ్‌ బ్యాక్‌: వాళ్ళకి క్వశ్చన్‌ మార్క్‌

జనసేన అమ్ములపొదిలో మరో ‘అస్త్రం’

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...