Switch to English

వ్యాక్సినేషన్ రికార్డ్: వైసీపీ సర్కార్ ‘పబ్లిసిటీ’ రూటే సెపరేటు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు పదమూడున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేసింది ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే, ఆంధ్రపదేశ్ వాటా 47 శాతమట. అది నిజమేనని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, తెరవెనుకాల చేదు నిజం ఇంకోటి వుందంటూ, స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలియజేస్తున్నారు నెటిజన్లు.

ఈ రోజుల్లో అధికారిక లెక్కల్ని మాయ చేసెయ్యడం అంత తేలిక కాదు. జూన్ 20వ తేదీన పదమూడున్నర లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు సరే.. జూన్ 16వ తేదీన ఎన్ని వ్యాక్సిన్లు వేశారట.? జూన్ 17న ఎన్ని వ్యాక్సిన్లు అందించారట.? జూన్ 18, జూన్ 19 తేదీల్లో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటి.? ఇంతకీ, జూన్ 21వ తేదీన.. అంటే నేడు ఎన్ని వ్యాక్సిన్లను, ‘వ్యాక్సినేషన్ రికార్డ్’ తర్వాత ఆంధ్రపదేశ్ వేసింది.? ఈ లెక్కలు తీస్తే, మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.

జూన్ 16న 30,669 వ్యాక్సిన్లను ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వేశారు. జూన్ 17న ఈ సంఖ్య 21,891. జూన్ 19 వాటా 22,692. జూన్ 19 లెక్క 14,248. అంటే, వరుసగా నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కావాలనే నెమ్మదించేలా చేసి.. ఒకే రోజు రికార్డు క్రియేట్ చేశారన్నమాట. తద్వారా వ్యాక్సినేషన్ కేంద్రాలకు జనం పోటెత్తేలా చేశారన్నమాట.

రికార్డు సంగతి సరే.. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఒకేసారి జనం వెళ్ళడం వల్ల కరోనా వ్యాప్తి జరిగితేనో.? ఆ సంగతెవడిక్కావాలి.. ఇక్కడ కావాల్సింది రికార్డులు. అన్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో 16, 17, 18, 19 తేదీల్లో ప్రతిరోజూ లక్షా డెబ్భయ్ వేలకు పైగా వ్యాక్సిన్లను వేశారు. జూన్ 21వ తేదీన ఆంధ్రపదేశ్ వ్యాక్సినేషన్ లెక్క సుమారు 30 వేలు కాగా, తెలంగాణలో ఆ సంఖ్య దాదాపు లక్షా ఇరవై వేలుగా వుంది. ఈ లెక్కల విషయమై అధికార పార్టీ ఏం చెబుతుందో.. వీటిని తప్పుడు లెక్కలుగా ప్రభుత్వం ఖండిస్తుందోగానీ.. కరోనా వేళ కూడా రికార్డుల కోసం తాపత్రయ పడటమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటేముంది.?

జాబ్ క్యాలెండర్లలో ఉద్యోగాల లెక్కకీ.. కరోనా వ్యాక్సినేషన్ రికార్డులకీ.. సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లు చూస్తే.. అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. అయినాగానీ, తాము చేసే పబ్లిసిటీ స్టంట్లకు వచ్చే కిక్కు ముందు.. ఎవరేమనుకున్నా బలాదూర్.. అనుకుంటే చేయగలిగేదేముంది.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...