Switch to English

ప్రత్యేక హోదా కోసం జగన్ ‘ఒత్తిడి’ ఎప్పటిదాకా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా అంశం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2021-22 ఏడాదికిగాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ‘అడుగుతూనే వున్నాం.. అడుగుతూనే వుంటాం..’ అని గతంలోనే ప్రత్యేక హోదా కోసం పలుమార్లు సెలవిచ్చిన ముఖ్యమంత్రి, ‘ఒత్తిడి తెస్తాం.. తెస్తూనే వుంటాం..’ అని తాజాగా సెలవిచ్చారు.

కానీ, ఈ ‘అడగడం’, ‘ఒత్తిడి తేవడం’ వంటి విషయాల్లో అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడాలున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక హోదా అడగడమంటే ఉద్యమించడం. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తీసుకురావడమంటే రాజీనామాలు చేయడం. కానీ, ఇప్పుడలాంటివేమీ లేవు.. మరో మూడేళ్ళు వుండకపోవచ్చు కూడా. ఎందుకిలా.? అంటే, అట్నుంచి ఒత్తిడి ఆ స్థాయిలో వుంది ముఖ్యమంత్రి మీద.. అన్న వాదనలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే ఏం ఉపయోగం.? ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి. కానీ, అది జరగని పని. అందుకే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కానీ, ఆ ప్రత్యేక హోదా పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు నడుస్తూనే వుంటాయి. ఆ ప్రత్యేక హోదానే 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీలకు అధికారాన్నిచ్చింది.. ఆ ప్రత్యేక హోదానే వైసీపీకి 2019లో అధికారం రావడానికి కారణమయ్యింది. ఆ ప్రత్యేక హోదానే 2024 ఎన్నికల్లో ఇంకెవరికో అధికారం కట్టబెట్టేలా వుంది. అంతే తప్ప, ఆ ప్రత్యేక హోదా రాష్ట్రానికి మాత్రం వచ్చే అవకాశమే లేదు.

గత పాలకులు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాని తాకట్టుపెట్టేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెలవిచ్చారు. అదే నిజమైతే, ప్రస్తుత పాలకులు ప్రత్యేక హోదాని దేని కోసం తాకట్టు పెట్టేశారట.? అప్పుడేమో ఓటుకు నోట్లు వ్యవహారం నుంచి బయటపడేందుకు టీడీపీ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిందట. మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదా విషయమై ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదు కేంద్రం మీద.? తమ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడంలేదు.? ఏ కేసుల కోసం హోదాని తాకట్టు పెడుతున్నారు.? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా వుంటుందా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....