Switch to English

రఘురామ ఫిర్యాదుపై హోం శాఖను వివరణ కోరిన లోక్ సభ స్పీకర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్ కార్యలయం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాయడం గమనార్హం. 15 రోజుల్లోనే స్పీకర్ కార్యలయానికి రఘురామ అరెస్టు వ్యవహారానికి సంబంధించి సమగ్ర వివరాలు పంపాల్సి వుంటుంది.

మే 14న తనను ఏపీ సీఐడీ అరెస్టు చేసి, తన మీద థర్డ్ డిగ్రీ టార్చర్ ప్రయోగించిందని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభా హక్కుల నోటీసు కూడా ఇవ్వడం గమనార్హం. మరోపక్క, రఘురామ కుమారుడు భరత్ కూడా తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా రఘురామ అరెస్టుపై స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రాజద్రోహం కేసులో రఘురామని అరెస్టు చేయడం, ఆ తర్వాత పరిణామాలన్నీ అత్యంత నాటకీయంగా మారడం తెలిసిన సంగతులే. రఘురామ తన మీద ఏపీ సీఐడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని చెబుతున్నారు. అదంతా అవాస్తవం.. అని అంటోంది ఏపీ సీఐడీ. కానీ, రఘురామ కాలిపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. ఆ గాయాలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య చికిత్స అందించడం జరిగింది.

మెడికల్ రిపోర్టు విషయంలోనూ ఏపీ సీఐడీ, ఏపీ ప్రభుత్వం (ప్రభుత్వాసుపత్రి ఇచ్చిన నివేదిక.. అంటే ప్రభుత్వ నివేదికలానే భావించాలన్నది నిపుణుల వాదన) తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రఘురామ ఇప్పటికీ ఇదివరకటిలా నడవలేకపోతున్నారు.. అంతలా ఆయన కాలికి గాయాలయినట్లే తెలుస్తోంది. కానీ, అసలు గాయాలే కాలేదనీ, చర్మ సమస్య కారణంగా ఏర్పడ్డ ఎర్రటి మచ్చల్ని గాయాలుగా రఘురామ చూపిస్తున్నారని ఏపీ సీఐడీ చెబుతోన్న విషయం విదితమే. మొత్తమ్మీద, స్పీకర్ కార్యాలయం కేంద్ర హోంశాఖ నుంచి వివరణ కోరడంతో.. ఆ హోంశాఖ కార్యదర్శి ఎలాంటి వివరాల్ని స్పీకర్ కార్యాలయానికి పంపుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....