Switch to English

అక్షర మూవీ రివ్యూ – గుడ్ పాయింట్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్.!

Critic Rating
( 1.50 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
Movie అక్షర
Star Cast నందిత శ్వేత, షకలక శంకర్, సత్య, మధు
Director బి. చిన్ని కృష్ణ
Producer అహితేజ బెల్లంకొండ - సురేష్ వర్మ అల్లూరి
Music సురేష్ బొబ్బిలి
Run Time 2 గంటల 15 నిమిషాలు
Release ఫిబ్రవరి 26, 2021

టాలెంటెడ్ హీరోయిన్ గా పెరి తెచ్చుకున్న నందిత శ్వేత ప్రధాన పాత్రలో, షకలక శంకర్, సత్య, మధులు ముఖ్య పత్రాలు పోషించి సినిమా ‘అక్షర’. విద్యారంగంలో జరుగుతున్న క్రైమ్ కథాంశంతో, ఇప్పటివరవూ కామెడీ చిత్రాలు డైరెక్ట్ చేసిన చిన్ని కృష్ణ డైరెక్షన్ లో, యంగ్ ప్రొడ్యూసర్స్ అహితేజ – సురేష్ లు అక్షరని నిర్మించారు. ట్రైలర్ తో తెలంగాణ సీఎం కుమార్తె కవిత, సాయి తేజ్, విశ్వక్ సేన్ లాంటి మన్ననలు పొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అక్షర  ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

విద్య విధాన్ విద్య సంస్థల అధినేత సంజయ్ భార్గవ్(సంజయ్ స్వరూప్) ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా తన విద్య విధాన్ వైపే చూడాలనుకుంటాడు. అందులో భాగంగా ర్యాంకింగ్స్ కోసం స్టూడెంట్స్ మీద విపరీతమైన ప్రెజర్ ఇస్తుంటాడు. అందులో ప్రెజర్ భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నా పట్టించుకోడు. ఆ టైంలో విద్య విధాన్ కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా అక్షర(నందిత శ్వేత) చేరుతుంది. కాలేజ్ లో బోర్డు మెంబర్ అయిన శ్రీతేజ (శ్రీతేజ) అక్షర చేసే పనుల వలన తనపై ఆసక్తి పెంచుకుంటాడు. మరోవైపు అక్షర ఉంటున్న కాలనీలో బేవార్స్ గా ఉండే వాల్తేర్ కింగ్స్(షకలక శంకర్, సత్య, మధు)లు అక్షరని సెపరేట్ సెపరేట్ గా ప్రేమించడం మొదలు పెడతారు. ఇదిలా ఉంటే ఓ రోజు శ్రీతేజ అక్షరకి ప్రపోజ్ చేసే టైంలో, అక్షర శ్రీతేజని కాల్చి చంపేస్తుంది. ఆ సంఘటన చూసిన షకలక శంకర్, సత్య, మధులు పారిపోతారు. ఇక అక్కడి నుంచి అక్షర ఎవరు? ఎందుకు తనని ఇష్టపడే శ్రీతేజను చంపింది? అసలు అక్షర కథ ఏంటి? ఏ టార్గెట్ తో విద్య విధాన్ కాలేజ్ లో చేరింది? మర్డర్ చూసి పారిపోయిన షకలక శంకర్, సత్య, మధులు ఏం చేశారు? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

నందిత శ్వేతని ప్రెజంట్ చేసిన విధానం బాగుంది. ఓ వైపు ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ గా, మరోవైపు డార్క్ షేడ్స్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. శ్రీతేజ ఉన్నంతలో ఓకే అనిపిస్తాడు. షకలక శంకర్, సత్య, మధుల నటన పరవాలేధనిపించినా, డైరెక్టర్ వారి పాత్రలతో అనుకున్న కామెడీ అయితే వర్కౌట్ కాలేదు. నెగటివ్ షేడ్స్ లో సంజయ్ స్వరూప్ నటన బాగుంది. సినిమాకి కీలకమైన పాత్ర పోషించిన హర్ష వర్ధన్ కి సినిమాలోని అందరి నటీనటులకన్నా ఎక్కువ మార్కులు పడతాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి బిగ్ పిల్లర్ అని చెప్పచ్చు.

తెర వెనుక టాలెంట్..

అక్షర – చిన్న బడ్జెట్ లో ఓ పెద్ద స్టోరీ పాయింట్ ని చెప్పాలనుకున్న సినిమా. కథ కోసం ఎంచుకున్న పాయింట్స్ ప్రతి ఇంట్లో పేస్ చేస్తున్న పాయింట్ కావడం వలన అందరికీ కనెక్ట్ అవుతుంది. సో స్టోరీ పాయింట్ లో బోలెడంత విషయం ఉంది, కానీ కథగా రూపుదిద్దుకునే టైంకి అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేదనిపిస్తుంది. చెప్పాల్సిన కథ మొత్తాన్ని కేవలం ఫ్లాష్ బ్యాక్ లో చెప్పేసి మిగిలిన కథ అంతా ఏదో సీన్స్ తో అతికించినట్టుగా ఉంది. కథనంలో అయినా ఆ లోపాల్ని కవర్ చేశారా అంటే అదీ లేదు. చెప్పాలంటే కథనం మరో బిగ్గెస్ట్ మైనస్. ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయినా కథలోకి వెళ్ళ కుండా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంటుంది. సెకండాఫ్ కూడా త్వరగా కథలోకి వెళ్లకుండా సాగదీసి నిదానంగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ బాగుంది, కానీ కథకి ఇచ్చిన ఫైనల్ కంక్లూజన్ సినిమాటిక్ లిబర్టీతో చకచకా ఫినిష్ చేసేసినట్టు ఉండడం వలన పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.

డైరెక్టర్ చిన్ని కృష్ణ అనుకున్న పాయింట్ బాగున్నా ఎఫెక్టివ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. పైగా ఓల్డ్ ఫార్మాట్ కామెడీని ఎంచుకోవడం, అవి నవ్వు తెప్పించలేకపోవడం వలన సినిమా బాగా బోర్ కొట్టేస్తుంది. ఓవరాల్ గా ఓ సీరియస్ సబ్జెక్టుని ఆసక్తికరంగా చెప్పలేక ఆడియన్స్ బాగా బోర్ కొట్టించేసారు. నగేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. అవసరం లేని చోట్ల కూడా డ్రోన్ షాట్స్ ఎక్కువ కనిపిస్తాయి అవి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఓకే ఓకే.. కంటెంట్ లో మేటర్ లేదు కానీ మ్యూజిక్ తో ఏదో చెయ్యాలని ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ జస్ట్ ఓకే. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

–  ఒరిజినల్ స్టోరీ లైన్
– ఇంటర్వెల్ బ్లాక్
–  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
– సోషల్ మెసేజ్

బోరింగ్ మోమెంట్స్:

– కథగా తీర్చిదిద్దిన విధానం
– ఆసక్తిలేని కథనం
– స్లో నేరేషన్
– అనుకున్న కామెడీ ఫీల్ అవ్వడం
– బోరింగ్ ఫస్ట్ హాఫ్
– ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోవడం
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

ప్రస్తుతం ఎడ్యుకేషన్ పేరుతో పిల్లల్ని అటు ఇన్స్టిట్యూట్స్ , పేరెంట్స్ ఎంతలా ప్రెజర్ చేసేస్తున్నారు అనే సూపర్బ్ పాయింట్ ని తీసుకొని చేసిన సినిమా ‘అక్షర’. పాయింట్ గా అందరికీ టచ్ అయ్యేదే అయినప్పటికీ ఓల్డ్ స్టోరీ ఫార్మాట్ లో, అంతకుమించిన బోరింగ్ కథనంతో, ఎంగేజింగ్ గా చెప్పకపోవడంతో సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఓ మంచి పాయింట్ వృధా అయిపోయిందే అనిపిస్తుంది.

చూడాలా? వద్దా?: కష్టమే సుమీ.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...