Switch to English

సాక్షి వర్సెస్ టీవీ9.. వేడెక్కిన మీడియా.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఓ వైపు ఎన్నికల వేడి.. మరోవైపు భానుడి దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల్లో తాజాగా టీవీ9 వ్యవహారం మరిన్ని సెగలు రేపుతున్నాయి. మెరుగైన సమాజం కోసం అంటూ నీతులు వల్లెవేసిన ఆ ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో చిక్కుకోవడం దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. సంస్థ నిధులను దుర్విగినియోగం చేయడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం కలకలం రేపింది.

దీంతో గురువారం పోలీసులు టీవీ9 కార్యాలయంతోపాటు టీవీ9 డైరెక్టర్ మూర్తి, మాజీ సీఈఓ రవిప్రకాశ్, నటుడు శివాజీ నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ వ్యవహారంపై దాదాపు అన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే, శుక్రవారం ఉదయం టీవీ9 కార్యాలయం వద్ద కవరేజ్ చేస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడికి యత్నించారు. వాస్తవానికి అక్కడ ఇతర ఛానళ్ల ప్రతినిధులు కూడా కవరేజ్ చేస్తున్నప్పటికీ కేవలం సాక్షి మీడియానే రవిప్రకాశ్ అనుచరులు అడ్డుకున్నారు. సాక్షి రిపోర్టర్ ను నెట్టివేస్తూ, కెమెరాను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర ఛానళ్ల ప్రతినిధులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం సాక్షిని మాత్రమే అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే వారు ఇలా చేశారా? సాక్షిని అడ్డుకోవాలన్న తమ బాస్ ఆదేశాల మేరకే వారు ప్రవర్తించారా? అంటే.. ఔననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సాక్షిని మాత్రమే రవిప్రకాశ్ లక్ష్యం చేసుకోవడానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే.. కొంత వెనక్కి వెళ్లాలి. మెరుగైన సమాజం కోసం అంటూ టీవీ జర్నలిజంలో కొత్త ఒరవడి సృష్టించిన టీవీ9.. జనాల ఆదరణతోపాటు చాలా అంశాల్లో విమర్శలు కూడా మూటగట్టుకుంది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా బాకా కొట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు వ్యతిరేకిగా మారింది. ఓ దశలో రవిప్రకాశ్ కు జగన్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారని సమాచారం. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత ముదిరింది. ఇది అలా కొనసాగుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలో నటుడు శివాజీ ద్వారా ఆపరేషన్ గరుడ పేరుతో టీవీ9 ప్రసారం చేసిన ఎపిసోడ్.. తెలుగు రాజకీయాల్లో కలకలం రేపింది. ఇదంతా టీడీపీ ఆడిస్తున్న నాటకం అని వైఎస్సార్ సీపీ ఖండించినప్పటికీ, ఎప్పటికప్పుడు ఆపరేషన్ గరుడ వివరాలంటూ నటుడు శివాజీకి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేయడంలో టీవీ9 బాగా సక్సెస్ అయింది.

అయితే, ఈ క్రమంలో టీవీ9 యాజమాన్యం మారింది. సంస్థ చైర్మన్ శ్రీనిరాజు తన 90 శాతం వాటాలను అలంద మీడియాకు విక్రయించడంతో అధికారికంగా యాజమాన్య మార్పిడి కూడా పూర్తయింది. అయితే, కొత్త యాజమాన్యానికి రవిప్రకాశ్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. డైరెక్టర్ల నియామకానికి సైతం అడ్డు తగలడం.. కొత్త యాజమాన్యాన్ని ఇరుకున పెట్టే ఉద్దేశంతో తెరవెనుక పావులు కదుపుతున్నారనే విషయం తెలియడంతో అలంద మీడియా పోలీసులను ఆశ్రయించింది. సంస్థ నిధులను అక్రమంగా తన ఖాతాలకు మళ్లించుకోవడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి అవకాశం కోసమే వేచి చూస్తున్న సాక్షి మీడియా.. ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేసింది. తన ఛానల్ తోపాటు పత్రికలోనూ కథనాలు ప్రచురించింది. వీటికి తోడు వైఎస్సార్ సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రవిప్రకాశ్ పై విరుచుకుపడ్డారు. అనంతరం సాక్షి పత్రికలో ఆయన పేరుతో పెద్ద కథనం కూడా ప్రచురితమైంది. సహజంగానే ఇది రవిప్రకాశ్ కు ఆగ్రహం కలిగించింది. దీంతో టీవీ9 కార్యాలయం వద్ద రిపోర్టింగ్ చేస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులను ఆయన అనుచరులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...