సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి టెర్రిఫిక్ కలెక్షన్స్‌తో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24.6 కోట్ల షేర్ వసూలు చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా మే 10 (శుక్రవారం) చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ”మహర్షి’ మే 9న రిలీజై మహేష్‌బాబు కెరీర్‌లో హయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. ఇది ముందుగా ఎక్స్‌పెక్ట్ చేసిందే. మొదటి రోజు సినిమాని చూసి మహేష్‌బాబు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెవెన్యూ ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీడియావారు కూడా సినిమాతో కనెక్ట్ అయినందుకు వారికి ధన్యవాదాలు. నైజాంలో నాన్ బాహుబలి రెవెన్యూ వచ్చింది. దాదాపు అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా మహేష్‌బాబుగారి కెరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీ అవబోతుంది. ఈరోజు కూడా నెల్లూరులో 9 థియేటర్స్ ఉంటే అన్నీ ఫుల్స్ అయ్యాయి. ఈ సినిమా కమర్షియల్‌గా నెక్స్‌ట్ లెవెల్‌కి వెళ్ళబోతుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈ సమ్మర్‌లో, తెలుగు ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్‌గా నిలుస్తుందనుకుంటున్నాను. ‘మహర్షి’ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్” అన్నారు.
‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల తొలి రోజు వసూళ్ళు రూ. కోట్లలో…
నైజాం – 6.38 Cr
సీడెడ్ – 2.89 Cr
ఉత్తరాంధ్ర – 2.88 Cr
ఈస్ట్ – 3.20Cr
వెస్ట్ – 2.47 Cr
కృష్ణా – 1.39 Cr
గుంటూరు – 4.4 Cr
నెల్లూరు – 1 Cr
ఆంధ్ర, తెలంగాణ ఫస్ట్ డే షేర్ – 24.61 కోట్లు.