Switch to English

బెడ్రూమ్‌లోకీ దూరిన మీడియా: రవిప్రకాష్‌ పుణ్యమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలుగు టీవీ న్యూస్‌ ఛానల్స్‌ రంగంలో టీవీ9 ఓ సంచలనం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కానీ, ఆ టీవీ9 పేరు చెబితేనే ‘జుగుప్స’ కలిగేలా చాలా సందర్భాల్లో ఆ మీడియా ప్రతినిథులు వ్యవహరించారనడానికి చాలా ఉదంతాలే సాక్ష్యంగా కన్పిస్తాయి. ఎక్కడన్నా ఏదన్నా ఘటన జరిగితే, అది గనుక ఎక్కువ టీఆర్పీ రేటింగుల్ని సాధించే సత్తా వున్నదైతే, ఇక ముందూ వెనుకా ఆలోచించే ప్రసక్తే లేదు. ‘మేం మీడియా, మేం ఎక్కడికైనా వెళ్తాం, ఎవరి బెడ్రూమ్‌లోకి అయినా తొంగి చూస్తాం’ అన్నట్లుగా ఓ కొత్త తరహా జర్నలిజం పుట్టుకొచ్చింది.. దానికి రవిప్రకాష్‌ నేతృత్వంలోని ఓ బృందమే శ్రీకారం చుట్టింది.

టీవీ9 అనే సంస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలతో మామూలుగా అయితే ప్రజలకు పెద్దగా సంబంధం లేదు. యాజమాన్యం మారడం, అంతర్గతంగా గొడవలు ఇవన్నీ జనం చర్చించుకునే అంశాలే కావు. కానీ, రవిప్రకాష్‌ విషయంలో ఎందుకు ఇంత చర్చ జరుగుతోందంటే, టీవీ9 పేరుతో ఆయన మీడియా రంగంలోకి తీసుకొచ్చిన సరికొత్త జర్నలిజం, దాని కారణంగా ప్రభావితమైన కొందరు వ్యక్తులు, టీఆర్పీ రేటింగుల కోసం టీవీ9 పడ్డ పాట్లు, వాటిని చూసి జనం నవ్వుకున్న వైనం, చీదరించుకున్న పరిస్థితులు.. ఇవన్నీ ఇప్పుడు రవిప్రకాష్‌ గురించి చర్చించుకునేలా చేస్తున్నాయి.

రవిప్రకాష్‌ పరారీలో వున్నాడన్న వార్తలొచ్చాక, ఆయన తన ఛానల్‌లో ప్రత్యక్షమయ్యారు. వివరణ ఇచ్చి సరిపెట్టకుండా, నైతిక విలువల గురించి మాట్లాడాడు. విలువల వలువలూడ్చేసి జర్నలిజం చేసిన ఆయన, ఆ జర్నలిజంలో విలువల గురించి మాట్లాడుతోంటే, బీభత్సమైన కామెడీ స్కీట్‌లా చాలామందికి అనిపించింది. నిజం చెప్పులు వేసుకునేలోపు, అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తుందట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఇది నిజ్జంగా నిజం. అది నిజమని ఎన్నోసార్లు టీవీ9 నిరూపించింది. న్యూస్‌ ఛానళ్ళ రంగంలో గాసిప్స్‌ని పాపులర్‌ చేసింది టీవీ9 అని అందరికీ తెలుసు.

సీనియర్‌ కమెడియన్‌ మల్లికార్జునరావు (బట్టల సత్తిగాడుగా తెలుగు ప్రేక్షకులకు పాపులర్‌) అనారోగ్యం పాలైతే, ఆయన చనిపోయాడంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లు ఇచ్చింది టీవీ9. ఆయన ఆ తర్వాత ఎంత మానసిక క్షోభ అనుభవించి వుంటాడు, ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడి వుంటారు? ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన దురదృష్టవశాత్తూ తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యానికి గురైతే, కన్ఫర్మేషన్‌ చేసుకోకుండా ‘మృతి’ వార్త ఎలా ప్రసారం చేస్తారో రవిప్రకాష్‌ సమాధానం చెప్పాలి. దీన్నే, అబద్ధం ప్రపంచం చుట్టి వచ్చేయడమంటారు రవిప్రకాష్‌గారూ!

సినీ తారల మీద గాసిప్స్‌ కావొచ్చు. అక్రమ సంబంధాల వ్యవహారాలు కావొచ్చు, రియల్‌ లైఫ్‌లో జరిగే క్రైమ్‌ సంబంధిత వార్తలు కావొచ్చు, మసాలా దట్టించి.. లేనివి వున్నట్లు, వున్నవి లేనట్టు ఇలా జర్నలిజం విలువల్ని పూర్తిస్థాయిలో దిగజార్చేసిన ఘనుడిగా రవిప్రకాష్‌కి మెరుగైన ట్రాక్‌ రికార్డ్‌ వుందన్నది మీడియాలో అందరికీ తెలిసిన సంగతే. నిజంగానే టీవీ9 మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్నదే అయితే, సంస్థలో అంతర్గత కుమ్ములాటల్ని బయటపెట్టాలి. రవిప్రకాష్‌ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న తీరుకు సంబంధించి బాధ్యత గల మీడియా ఛానల్‌గా ‘పోస్ట్‌ మార్టమ్‌’ చేయాలి. చేయగలదా? రవిప్రకాష్‌ చేయనిస్తాడా?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...