Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్-22- దేవి ఎలిమినేట్‌, అందరి కళ్లలో కన్నీరు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మూడవ ఎలిమినేషన్‌ చాలా షాకింగ్‌ గా అనిపించింది. మొదటి వారంలో అంతా అనుకున్నట్లుగా సూర్య కిరణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. రెండవ వారంలో షో నుండి కరాటే కళ్యాణి ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవుతుందని భావించారు అనుకున్నట్లుగానే ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. మూడవ వారంలో ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారిలో ఖచ్చితంగా కుమార్‌ సాయి, మెహబూబ్‌ లేదా అరియానాల్లో ఒక్కరు ఎలిమినేట్‌ అవుతారు అనుకున్నారు. టీవీ9 దేవి ఎలిమినేషన్‌ లో ఉన్నా కూడా ఆమెను ఎవరు కూడా ఊహించలేదు. కాని అనూహ్యంగా ఆమె ఎలిమినేషన్‌ అయ్యింది.

శనివారం స్టార్‌ మా వర్గాల వారు కావాలని మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు అంటూ లీక్ ఇచ్చారు. కాని నిన్నటి నుండి కూడా దేవి ఎలిమినేషన్‌ అయ్యింది అంటూ ప్రచారం మొదలు అయ్యింది. మెహబూబ్‌ కాకుండా దేవి ఎలిమినేట్‌ అవ్వడం ఏంటీ అంటూ చాలా మంది అనుకున్నారు. ఫేక్‌ ఎలిమినేషన్‌ అయినా అయ్యి ఉండాలి లేదంటే అది తప్పుడు ప్రచారం అయ్యి ఉండాలంటూ కొందరు భావించారు. షో ను చాలా ఉత్కంఠభరితంగా చూసిన వారికి షాక్‌ ఇస్తూ దేవి నాగవల్లి ఎలిమినేట్‌ అయ్యింది. చివరి నిమిషం వరకు కుమార్‌ సాయి మరియు దేవి నాగవల్లి ఎలిమినేషన్‌ లో ఉన్నారు. చివరకు రంగు లో చేయి పెట్టగా కుమార్‌ సాయికి గ్రీన్‌ రాగా దేవికి మాత్రం రెడ్‌ వచ్చింది.

రెడ్‌ వచ్చిన దేవి ఎలిమినేట్‌ అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపించే క్రమంలో అందరు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా అరియానాకు దేవి బాగా కనెక్ట్‌ అయ్యింది. ఇద్దరు కూడా ముందు రోజు అంతకు ముందు రోజు కూడా చాలా ఎక్కువ సమయం గడిపినట్లుగా మనం చూడవచ్చు. ఈ ఇద్దరు కూడా లేడీ బిగ్‌ బాస్‌ గా నిలుస్తాం అంటూ వచ్చామని చాలెంజ్‌ చేశారు. అందుకే దేవికి అరియానాకు బాగా కనెక్షన్‌ కుదిరింది. అందుకే దేవి ఎలిమినేట్‌ అనగానే అరియానా గట్టిగా ఏడ్చేసింది. దాదాపు అంతా కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవి స్టేజ్‌ పైకి వెళ్లిన తర్వాత కూడా చాలా విభిన్నంగా ఒకొక్కరి గురించి మాట్లాడటం జరిగింది.

రెండు వారాల క్రితం అమ్మ రాజశేఖర్‌ మరియు దేవిల మద్య చిన్నపాటి యుద్దమే జరిగింది. కాని అది కూడా సమసి పోయి దేవి ఎలిమినేట్‌ సమయంలో అమ్మ రాజశేఖర్‌ కన్నీరు పెట్టకున్నాడు. మొత్తానికి దేవి ఎలిమినేట్‌ అవ్వడం ప్రేక్షకులకు కూడా షాకింగ్‌గా ఉంది. నెటిజన్స్‌ దేవి ఎలిమినేషన్‌ అవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్‌ పక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమార్‌ సాయి, మెహబూబ్‌ వంటి వీక్‌ కంటెస్టెంట్స్‌ ఎలిమినేషన్‌ లో ఉండగా దేవి ఎలా ఎలిమినేట్‌ అవుతుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆమె ప్రవర్తన కారణంగా ప్రేక్షకులు ఆమెను అర్థం చేసుకోక పోవడంతో పాటు ఏదో తప్పు జరిగిందని నెటిజన్స్‌ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...