Switch to English

నానీ వ్యాఖ్యలతో వైసీపీకి డ్యామేజీ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తిరుమల డిక్లరేషన్ వివాదం వైసీపీకి భారీగానే డ్యామేజీ చేసిందా? చంద్రబాబు అండ్ కో వ్యూహాత్మకంగా విసిరిన ట్రాప్ లో వైసీపీ పడిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వైసీపికి ఇబ్బందిగానే పరిణమించాయని అంటున్నారు. ఓవైపు కేంద్రంతో దోస్తీ వైసీపీకి అవసరం.. అదే సమయంలో వైసీపీ రాజ్యసభ బలం బీజేపీకి అవసరం. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలూ ఓ అండర్ స్టాండింగ్ తో ముందుకెళ్లాలనే ఆయా పార్టీల అధిష్టాన పెద్దలు భావిస్తారు.

నిజానికి బీజేపీకి వైసీపీ అవసరం కంటే వైసీపీకి బీజేపీ అండ అత్యవసరం. నిధులు రావాలన్నా.. కేసుల విషయంలో ప్రతికూలతలు రాకూడదన్నా కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నడపాల్సిందే. అయితే, డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర బీజేపీ.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించినా, పెద్ద సమస్య లేదు. కానీ ఎప్పుడైతే మంత్రి నాని ఈ వ్యవహారంలోకి ఎంటరై తనదైన శైలిలో విరుచుకుపడ్డారో వ్యవహారం మొత్తం వేడెక్కింది. భజరంగ్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగిపోయారు.

పోని ఇక్కడితే వదిలేస్తే ఏదో ఒక విధంగా వైసీపీ డ్యామేజీని పూడ్చుకుని ఉండేది. కానీ నాని అకస్మాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమై ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు చేశారు. అయోధ్య భూమి పూజకు మోదీ ఏ భార్యతో వెళ్లారని.. యోగి ఎవరిని తీసుకెళ్లారంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది.

నిజానికి జగన్ తిరుమల వెళ్లడం ఇదే తొలిసారి కాదు. అయినా, డిక్లరేషన్ వ్యవహారం ద్వారా వైసీపీని ఇరుకున పడేయడానికే చంద్రబాబు మంచి ఎత్తుగడ వేశారు. ఈ ట్రాప్ లో నాని సులభంగా పడిపోయారు. బాబంటే అసలే దుందుడుకుగా వ్యవహరించే నాని.. ఆవేశంలో ఏకంగా మోదీనే టార్గెట్ చేశారు. బాబు కోరుకుంది కూడా ఇదే. నిజానికి తిరుపతి ప్రాంత నేతల్లో రోజా మినహా మిగిలిన వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు.

జగన్ అంటే విపరీతమైన అభిమానం కలిగిన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు కూడా ఈ వ్యవహారాన్ని టచ్ చేయలేదు. నాని మాత్రం రెచ్చిపోయి మోదీని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి అయోధ్య భూమిపూజలో మోదీ ముఖ్య అతిథిగా మాత్రమే పాల్గొన్నారు. అక్కడ దంపతులు చేయాల్సిన ప్రక్రియ అంతా సలీల్ సింఘాల్, ఆయన భార్య మధు సింఘాల్ పూర్తిచేశారు. విశ్వహిందూ పరిషత్ మాజీ నేత అశోక్ సింఘాల్ సోదరుడే సలీల్ సింఘాల్. అంటే.. హిందువుల సంప్రదాయం ప్రకారం దంపతులతోనే అయోధ్య భూమి ప్రక్రియ జరిగింది.

అయితే, చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కావడంతో ఫోకస్ మొత్తం ఆయనపైనే ఉండటంతో సలీల్ సింఘాల్ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు. ఇక యోగి తన భార్యతో వెళతాడా అంటూ నాని చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగి బ్రహ్మచర్యం గురించి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని జగన్ భావిస్తుంటే.. నాని వంటి నేతలు అందుకు విరుద్ధంగా వ్యహరిస్తూ వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...