Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: వి – ‘వి’జయ పతాకం ఎగరేయలేక చతికిల పడిన ‘వి’

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,451FansLike
57,764FollowersFollow
Movie వి
Star Cast నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేత థామస్
Director ఇంద్రగంటి మోహన కృష్ణ
Producer దిల్ రాజు
Music అమిత్ త్రివేది & ఎస్.థమన్
Run Time 2 గంటల 20 నిముషాలు
Release సెప్టెంబర్ 5, 2020

నాచురల్ స్టార్ నాని నటించిన 25వ సినిమా, అందులోనూ నాని మొదటిసారి భయపెట్టే సైకో కిల్లర్ లా విలన్ పాత్ర.. సుధీర్ బాబు హీరోగా రూపొందిన మల్టీ స్టారర్ ఫిల్మ్, మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ జానర్ లో చేస్తున్న మొదటి సినిమా, నివేత థామస్ – అదితి రావు హైదరిలు హీరోయిన్స్.. వీళ్ళందరికీ ప్రధాన బలం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. టీజర్ సూపర్ హిట్.. ఆ సినిమానే ‘వి’. సినిమా థియేటర్స్ లో దద్దరిల్లిపోద్ది అనుకుంటున్నా టైంలో కరోనా అనే మహమ్మారి సినిమా విడుదలని ఆపేసింది. 5 నెలలైనా సినిమా థియేటర్స్ తెరుచుకునే ఆచూకీ కనిపించకపోవడంతో నేడు ‘వి’ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసారు. తెలుగు నుంచి మొదటి సారి రిలీజైన బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా ఎలా ఉందో? హిట్టా? ఫట్టా?? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పార్ట్మెంట్ లో మోస్ట్ సక్సెసఫుల్ ఆఫీసర్ డిసిపి ఆదిత్య (సుధీర్ బాబు). క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తనకి ఎదురేలేదు అనుకుంటున్న టైంలో లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనుమానాస్పదంగా, సైకోటిక్ గా చంపబడతాడు. ఆ మర్డర్ తర్వాత మరో నలుగురిని చంపబోతున్నానని, వీలయితే పట్టుకోమని ఆదిత్యకి ఛాలెంజ్ విసురుతాడు మన వి (నాని). ఇక అక్కడి నుంచి వారిద్దరి మధ్యా పోటీలో ఎవరు గెలిచారు? అసలు వి ఎందుకు ఆ ఐదుగురిని చంపాలనుకుంటాడు? చివరికి ఆ నలుగురిని చంపాడా? లేక ఆదిత్యకి దొరికిపోయాడా? అనేదే కథ..

తెర మీద స్టార్స్..

ఆన్ స్క్రీన్ పరంగా ‘వి’ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ నాని.. నాని.. నాని.. నెగటివ్ షేడ్స్ లో, సైకో కిల్లర్ గా మూడ్స్ ని మార్చి చూపించడంలో చూసే ఆడియన్స్ మతి పోగొడతాడని చెప్పాలి. తన యాటిట్యూడ్, పెర్ఫార్మన్స్, మ్యానరిజమ్స్ కి ఫిదా అయ్యే వాళ్ళు చాలా మందే ఉంటారు. నటుడిగా నానిని 10 మెట్లు పైకి తీసుకెళ్లే సినిమా ఈ ‘వి’. సుధీర్ బాబు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. ఇక ముఖ్య పాత్రల్లో అదితిరావు, నివేత థామస్ లు ఉన్నంతలో వారి వారి పాత్రలకి న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ సైలెంట్ పంచ్ లు అక్కడక్కడా బాగున్నాయి.

తెర వెనుక టాలెంట్..

టెక్నికల్ గా ముందు నుంచి చెబుతూ వచ్చినట్లే విజువల్స్ అండ్ సౌండ్ డిజైనింగ్ గురించి మాట్లాడాలి. పిజి విందా చూపిన విజువల్స్ తెలుగు స్క్రీన్ కి ఫస్ట్ టైం అని చెప్పాలి. చూస్తున్నంత సేపు మనం రోజు చూసేవేనా ఇవి, ఇలా చుపించారేంటి అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. అలాగే నటీనటుల్ని క్లోజ్ షాట్స్ లో చూపించిన విధానం సూపర్బ్. మంచి సౌండ్ సిస్టంలో చూస్తే సౌండింగ్ కూడా చాలా కొత్త ఫీల్ ని ఇస్తుంది. కానీ ట్యూనింగ్ కూడా అంతే కొత్తగా ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసిన థమన్ మేజర్ ట్యూన్స్ అన్నీ రీసెంట్ గా వచ్చిన థ్రిల్లర్ సినిమా ట్యూన్స్ ని యాజిటీజ్ గా వాడేయడం ఇట్టే మనకు తెలిసిపోతుంది. అమిత్ త్రివేది అందించిన పాటలు బాగున్నాయి. ఇకపోతే రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

రవి వర్మ ఫైట్స్ లో కిక్ లేదు.. ఒక్క ఫైట్ కూడా చూసే ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేయలేదు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కాస్త స్పీడ్ గా ఉండేలా సినిమాని కట్ చేసి ఉంటే బాగుండేది. ఇకపోతే కెప్టెన్ అఫ్ ది ఫిల్మ్ మోహనకృష్ణ ఇంద్రగంటి విషయానికి వస్తే.. ఎప్పుడో 2006 లో జరిగిన సంఘటన ఆధారంగా కథ రాసాను, పాత్రలను, సన్నివేశాలను ఇప్పటికి తగ్గట్టు మార్చాను అన్నారు. ఆయన చెప్పినట్టే ఇది చాలా పాత రివెంజ్ కథ. అందులోనూ ఈ సినిమాకి కావాల్సిన ఎమోషన్ ఎక్కడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఆ పరంగా కథని డ్రైవ్ కూడా చేయకపోవడంతో ఆడియన్స్ కి ఏం కథ చూస్తున్నాం, ఎందుకు చుస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక స్క్రీన్ ప్లే లో కూడా మజా లేదు. స్లోగా సాగడం, ఒక్క థ్రిల్ కూడా వావ్ కాదు కదా పరవాలేదు అనేలా కూడా లేకపోవడం, చూసేకొద్దీ ప్రేక్షకుడికి మూవీ ఆపేసి నిద్రపోయి, మిగిలింది సీరియల్ లా రోజుకింత చూద్దాం అనేలా చేసింది. డైరెక్షన్ పరంగా మోహన కృష్ణకి ఇదొక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పాలి. గతంలో ఆయనకి ప్లాప్స్ వచ్చినా ఆయనకి కథ – దర్శకత్వం విషయంలో ప్రశంశలు దక్కాయి. కానీ మొదటి సారి ఆయన ఏ డిపార్ట్మెంట్ లోనూ పాస్ కాలేదని, ఆయన కెరీర్లోనే వెరీ బాడ్ స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పచ్చు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నాని ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్
– మైండ్ బ్లోయింగ్ విజువల్స్
– చివరి 10 నిమిషాలు

బోరింగ్ మోమెంట్స్:

– పరమ రొటీన్ కథ
– మధ్యలో చూడడం ఆపేయాలి అనిపించేలా సాగే కథనం
– బోరింగ్ నేరేషన్
– థ్రిల్స్ లేకపోవడం
– వీక్ డైరెక్షన్
– అస్సలు ఎమోషన్ కి కనెక్ట్ కాలేక పోవడం
– రన్ టైం

విశ్లేషణ:

వి’ – టీజర్ సూపర్, ట్రైలర్ బంపర్, నాని వేరియేషన్ అదుర్స్ అంటూ సినిమాపై మంచి అంచనాలే పెరిగాయి.. సినిమా చూసాక తేలిందేంటి అంటే.. టీజర్, ట్రైలర్ లో తప్ప సినిమాలో మేటర్ లేదని.. వి సినిమాలో వాడిన క్లూస్ భాషలో చెప్పాలంటే ‘పైన పటారం లోన లొటారం’ అనమాట. ‘వి’ ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేశారు. చెప్పిన దానిలో ఎమోషన్, యాక్షన్, థ్రిల్స్ ఇలా ఏవీ మెప్పించలేదు. ఇన్ని వర్కౌట్ కానప్పుడు కేవలం ఒక్క నాని నటన ఎంత వరకూ సేవ్ చేయగలదు. ఫైనల్ గా మోహన కృష్ణ ఇంద్రగంటి తనకి వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ అవకాశాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేశారు.

చూడాలా? వద్దా?: బాగా ఖాళీగా ఉండి, నానికి వీరాభిమాని అయితే ఒకింత ట్రై చేయచ్చు లేదా స్కిప్ చేసేయడమే.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...