Switch to English

బర్త్‌డే స్పెషల్‌ : తండ్రికి తగ్గ తనయుడు సూపర్‌ స్టార్‌ బిరుదుకు నూరు శాతం అర్హుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

సినిమా ఇండస్ట్రీలో నెపొటిజంకు సంబంధించిన విమర్శలు ఈమద్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారసులే ఎక్కువ వస్తున్నారు వారసత్వం ఉంటేనే స్టార్స్‌ అవుతున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. కాని వాసరత్వం అనేది కేవలం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ వారసత్వంతో స్టార్స్‌ సూపర్‌ స్టార్స్‌ అవ్వడం సాధ్యం కాదని పలువురు వారసుల విషయంలో వెళ్లడయ్యింది. హేమా హేమీల వారసులు సినిమాల్లో రాణించలేక పోయారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్‌ బాబు ఆయన వారసత్వంను ఎంట్రీ కోసమే ఉపయోగించుకుని ఆ తర్వాత తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తూ ప్రిన్స్‌ మహేష్‌ బాబుగా పేరు దక్కించుకున్నాడు. అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పొందడంతో పాటు వరుసగా ఇండస్ట్రీ హిట్స్‌ రావడంతో ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు మహేష్‌ బాబును సూపర్‌ స్టార్‌ అన్నారు. ఆ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ కు ఏమాత్రం అన్యాయం చేయకుండా సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ వసూళ్లు పెంచుకుంటూ అభిమానుల సంఖ్య పెంచుకుంటూ మహేష్‌ బాబు వెళ్తూనే ఉన్నాడు.

టాలీవుడ్‌ లో ఎక్కువ ప్రయోగాలు చేసిన హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన వారసుడిగా మహేష్‌ బాబు కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. చేసినవి 26 సినిమాలే అయినా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ విభిన్నమైన పాత్రలు ప్రయోగాత్మక సినిమాలు. ఇంత కంటే ఏం కావాలి మహేష్‌బాబు సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ కు అర్హుడు అవ్వడానికి. తనకు ఫ్యాన్స్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ బిరుదుకు నూటికి రెండు వందల శాతం న్యాయం చేస్తూ ఇండస్ట్రీలో దూసుకు పోతున్న మహేష్‌ బాబు సినీ కెరీర్‌ చిన్నతనంలోనే ప్రారంభం అయ్యింది.

45 ఏళ్ల మహేష్‌ బాబు 40 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతూనే ఉన్నాడు. స్కూల్‌ హాలీడేస్‌ ఉంటే చాలు సినిమాల్లో నటించేవాడు. తండ్రి కృష్ణ నటించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మహేష్‌బాబు చిన్నతనంలోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. బాల నటుడిగా మహేష్‌ బాబు చేసిన చాలా సినిమాలు మంచి సక్సెస్‌ అయ్యాయి. కొందరు బాల నటుడిగా చేసిన తర్వాత హీరోగా సెటిల్‌ అవ్వలేక పోయారు. కాని మహేష్‌ బాబు ఏకంగా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. చిన్నప్పుడు పెద్దయ్యాక దేనికి అదే అన్నట్లుగా మహేష్‌ కెరీర్‌ ను కొనసాగిస్తూ వచ్చాడు.

రాజకుమారుడు అనే చిత్రంతో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్‌ బాబు ఫుల్‌ లెంగ్త్‌ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత నుండి మహేష్‌ బాబు కాస్త ప్రిన్స్‌ మహేష్‌ బాబు అయ్యాడు. ఆ తర్వాత నిరాశ పర్చిన వంశీ కాస్త నిరాశ పర్చినా యువరాజు సక్సెస్‌ అయ్యింది. మురారి చిత్రంతో మహేష్‌ బాబు తన నట సామర్థ్యంను ప్రదర్శించాడు. అప్పటి నుండి మహేష్‌ కూడా మహేష్‌ బాబు కుమ్మేస్తూనే ఉన్నాడు. టక్కరి దొంగ చిత్రంతో ఈతరం హీరోలకు ఎవ్వరికి దక్కని రికార్డు దక్కించుకున్నాడు. కౌబాయ్‌ గా నటించి మెప్పించాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మహేష్‌ కెరీర్‌ లో ఆ సినిమా నిలిచి పోతుంది.

ఇక మహేష్‌ బాబు స్టార్‌ గా మరో పది మెట్లు ఎక్కడంలో ఒక్కడు సినిమా కీలకంగా నిలిచింది. ఆ తర్వాత చేసిన నిజం మళ్లీ మహేష్‌ బాబులోని నటన ప్రతిభను చూపించింది. అతడు సినిమా కమర్షియల్‌ గా అప్పుడు హిట్‌ అవ్వకున్నా ఇప్పటికి అదో అద్బుత చిత్రంగా మంచి పేరు దక్కించుకుంది. ఇక 2006 చిత్రంలో వచ్చిన పోకిరి చిత్రంతో మహేష్‌ బాబు ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. పోకిరి తర్వాత నాలుగు ఏళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ దూకుడు సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. అప్పుడప్పుడు ఫ్లాప్స్‌ పడ్డా కూడా క్రమం తప్పకుండా ఇండస్ట్రీ హిట్స్‌ రికార్డు బ్రేకింగ్‌ మూవీస్‌ చేస్తూ తనదైన శైలిలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్‌ లో దూసుకు పోతూనే ఉన్నాడు.

మొదటి 90 కోట్ల సినిమా మొదటి 100 కోట్ల సినిమాలను మహేష్‌ బాబు అందించాడు అనడంలో సందేహం లేదు. బాహుబలిని మినహా ఇస్తే ఓవర్సీస్‌ లో కూడా మహేష్‌ మూవీస్‌ కు అద్బుతమైన కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. టాలీవుడ్‌ హీరోల్లో అత్యధిక ఓవర్సీస్‌ మార్కెట్‌ ఉన్న హీరో ఎవరు అంటే క్షణం ఆలోచించకుండా మహేష్‌ బాబు పేరు చెప్పేయ్యవచ్చు. అంతగా అక్కడ పాతకు పోయాడు. ఈ ఏడాది సరిలేరు నీక్వెరు చిత్రంతో మరో హిట్‌ ను దక్కించుకున్నాడు. ఇక వచ్చే ఏడాది సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నేడు మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు ఆయన అభిమానుల తరపు నుండి ఇంకా మా తరపు నుండి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుట్టిన రోజులు మహేష్‌ బాబు మరెన్నో జరుపుకోవాలని.. మరెన్నో అద్బుతమైన సినిమాలను టాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...