Switch to English

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌.. కొత్తగా ఏం మారిందని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. 2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తేడా. అంతకు మించి, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగింది గతంలోనూ ఏమీ లేదు.. ఇప్పుడూ కన్పించడంలేదు. ‘మేం ప్రత్యేక హోదా తెస్తాం..’ అని చంద్రబాబు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు.. అదే హామీ ఇచ్చి వైఎస్‌ జగన్‌ కూడా ఎన్నికల్లో గెలిచారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా.? 2014 నుంచి 2019 వరకూ ‘చంద్రబాబుకి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి’ అని వైఎస్‌ జగన్‌ అల్టిమేటం జారీ చేశారు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇద్దరూ ఓ ఖచ్చితమైన రాజకీయ అవగాహనతో రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారా.? అన్న అనుమానం కలగక మానదు.

ప్రత్యేక హోదా తీసుకురావడం చంద్రబాబుకి చేతకాలదని విమర్శించిన వైఎస్‌ జగన్‌, ఎందుకు అదే ప్రత్యేక హోదా విషయంలో వైఫల్యం చెందుతున్నట్లు.? నిన్న చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు. దానిపై వైసీపీ నేతలు స్పందిస్తూ, ‘మేమెందుకు రాజీనామా చేస్తాం.? ఐదేళ్ళు మాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు కదా.!’ అంటూ బుకాయించేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వానికీ ఐదేళ్ళు పాలించమనే ప్రజలు అధికారం కట్టబెట్టారు. మరెందుకు చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవాలని వైఎస్‌ జగన్‌ విమర్శించినట్లు.? రాజకీయంగా చంద్రబాబు పనైపోయిందని రాష్ట్రంలో చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. కానీ, ఇప్పుడు ఆ చంద్రబాబుని ‘లేపేందుకు’ వైసీపీ ప్రయత్నిస్తోందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలామందికి.

‘అయితే మేం అధికారంలో వుండాలి.. మేం కాకపోతే మీరు అధికారంలో వుండాలి.. మధ్యలో ఇంకెవరికీ అవకాశం దక్కకూడదు’ అన్న కోణంలో టీడీపీ, వైసీపీ కలిసి ఓ పక్కా ప్రణాళికతో ‘కుమ్మకు రాజకీయాలు’ చేస్తున్నట్లే కన్పిస్తోంది.

ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాలేదు గనుక.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. రాజధాని అమరావతి విషయంలో మాట తప్పినందున, నైతికంగా ముఖ్యమంత్రి పదవిలో ఇంకా కొనసాగడానికి వైఎస్‌ జగన్‌ అనర్హుడన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది. కానీ, ప్రజలతో ఛీకొట్టించుకోవాలంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వేచి చూడాల్సిందేనన్న ధోరణిలో బహుశా టీడీపీలానే వైసీపీ కూడా ఎదురుచూస్తుందేమో.? అని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...