Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: 3 రాజధానులపై జనసేనాని ఆలోచనేంటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘అమరావతి విషయంలో బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చాకనే, ఆ పార్టీతో పొత్తుకి ఒప్పుకున్నాం..’ అంటూ కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. అయితే, అదే సమయంలో ‘బేషరతుగా జనసేన పార్టీ, బీజేపీకి మద్దతిచ్చింది..’ అని బీజేపీ చెప్పుకుంది. అయితే, బీజేపీ – జనసేన కలిసి అమరావతి విషయంలో పలుమార్లు స్పష్టతనిచ్చారు. ఇప్పటికీ బీజేపీ నేతలు, అమరావతి విషయంలో తమ స్టాండ్‌ మారలేదని చెబుతున్నారు. హైకోర్టు కర్నూలుకి వెళ్ళాలన్నది తమ డిమాండ్‌ అనీ, రాజధాని మాత్రం అమరావతిలోనే వుండాలనీ ఇప్పటికీ వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్న దరిమిలా..

ఈ ‘సున్నితమైన అంశం’ పట్ల జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత, జనసేన పార్టీ నుంచి ఓ విస్పష్టమైన ప్రకటన అమరావతిపై రాబోతోందట. మరోపక్క, బీజేపీపైన కూడా అమరావతి విషయమై ఒత్తిడి పెరుగుతోంది. కానీ, రాష్ట్ర బీజేపీకీ – కేంద్ర బీజేపీకి మధ్య కొంత ‘కమ్యూనికేషన్‌ గ్యాప్‌’ స్పష్టంగా కన్పిస్తోంది. అమరావతి రైతుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఢిల్లీ బీజేపీ నేతలు కూడా, ఏపీ బీజేపీ నేతల వాదనతో ఏకీభవిస్తున్నారు. కానీ, ‘రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు’ అని బీజేపీ నేతలు చెబుతుండడమే తీవ్ర గందరగోళానికి కారణం.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి వున్న బలమెంత.? అన్నది పరిశీలిస్తే.. ఆ పార్టీ ఎంత యాగీ చేసినా, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై పెద్దగా ప్రభావం వుండదు. కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గనుక తలచుకుంటే.. క్షణాల్లో, మూడు రాజధానులకు మోకాలడ్డేయడానికి వీలు పడ్తుంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే, బీజేపీ ఎంత గింజుకున్నా లాభం లేదు. అయితే, ఇక్కడే బీజేపీ నేతలు ‘న్యాయ పోరాటం’ అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు.. కోర్టులతో సమస్యకు పరిష్కారం వచ్చింది కదా.. అన్నది బీజేపీ వాదన. అందులోనూ నిజం లేకపోలేదు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి విషయమై తెచ్చిన ఆర్డినెన్స్‌నీ, మూడు రాజధానులపై జరిగిన చట్టాన్నీ ఒకేలా చూడలేం కదా.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే నిర్ణయం ఏదైనా రేపు తీసుకుంటారా.? బీజేపీ అధిష్టాన పెద్దలతో మంతనాల కోసం ప్రయత్నిస్తారా.? బీజేపీ – జనసేన.. అమరావతి విషయంలో ఇంకాస్త స్పష్టతని రానున్న రోజుల్లో ఇస్తుందా.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...