Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: యార(హిందీ) – స్కిప్ చేసి మీ టైం సేవ్ చేస్కోండి.!

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
Movie యార (హిందీ)
Star Cast విద్యుత్ జమాల్, శృతి హాసన్, అమిత్ సాద్, విజయ్ వర్మ
Director తిగ్మన్షు ధులియా
Producer తిగ్మన్షు ధులియా, సునీర్
Music క్లింటన్ సెరెజో
Run Time 2 గంటల 10 నిముషాలు
Release జూలై 30, 2020

యదార్థ సంఘటనల ఆధారంగా 2011లో ఫ్రెంచ్ లో రూపొందిన ‘ఏ గ్యాంగ్ స్టోరీ’ అనే సినిమాకి అధికారిక రీమేక్ గా రూపొందిన సినిమా ‘యార’. విద్యుత్ జమాల్ – అమిత్ సాద్ ప్రధాన పాత్రల్లో శృతి హాసన్ హీరోయిన్ గా థియేట్రికల్ రిలీజ్ కోసం రూపొందించిన ఈ గ్యాంగ్ బేస్డ్ ఫిల్మ్ కోవిడ్ -19 కారణంగా డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్(జీ5) ద్వారా నేడు విడుదలైంది. మరి మీ టైం స్పెండ్ చేసి చూసేంత సత్తా ఈ గ్యాంగ్ కి ఉందొ లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఓపెన్ చేస్తే .. 1950.. రాజస్థాన్ లో జన్మించిన ఫగున్(విద్యుత్ జమాల్) మరియు తన తండ్రి స్నేహితుని కుమారుడైన మిత్వా(అమిత్ సాద్) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. చిన్నతనంలోనే ఫగున్ తండ్రి చనిపోవడంతో ఎవరు లేని వారిద్దరూ ఆ ఊరు వదిలి బయలుదేరుతారు. అనుకోకుండా ఇండియా – నేపాల్ బార్డర్ లో ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరుతారు. అక్కడ వారిద్దరికీ రిజ్వాన్(విజయ్ వర్మ) మరియు బహదూర్(కెన్నీ బాసుమటారీ) అనే మరో ఇద్దరు స్నేహితులు పరిచయం అవుతారు. అక్కడ ఈ నలుగురు కలిసి వెపన్స్ స్మగ్లింగ్ చేస్తూ పెరుగుతారు. ఓ బ్యాంకు రాబరీ చేసి ఆ ఊరి నుంచి పారిపోతారు. ఎవ్వరికీ తెలియని ఓ ప్రాంతంలో సెటిల్ అయినా అక్కడ కూడా వెపన్స్ స్మగ్లింగ్ మొదలు పెడతారు. అదే టైంలో ఫగున్ కి పరిచయమైన సుకన్య(శృతి హాసన్) వలన ఆ నలుగురు విడివిడిగా జైలుకు వెళ్తారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నలుగురు జైలుకు వెళ్ళడానికి గల కారణం ఏమిటి? చివరికి ఆ నలుగురు కలిసారా? లేక ఎవరైనా చనిపోయారా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

నలుగురి ఫ్రెండ్స్ పాత్రల్లో విద్యుత్ జమాల్ మరియు అమిత్ సాద్ లకు కాస్త ఎక్కువ నటించే ఛాన్స్ ఉంది. వారి పాత్రల్లో ఇద్దరూ చాలా బాగా చేశారు. అలాగే విజయ్ వర్మ మరియు కెన్నీ బాసుమటారీలు కూడా ఉన్నంతలో బాగానే చేశారు. శృతి హాసన్ నటనకి పూర్తి ఆస్కారం ఉన్న పాత్ర చేసింది. ఎమోషనల్ సీన్స్ లో సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ది బెస్ట్ అనిపించుకుంది. మిగిలిన నటీనటులు కూడా పరవాలేధనిపించారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా చెప్పినట్టు ఇదొక ఫ్రెంచ్ ఫిలిం కి రీమేక్.. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా కథని మన బ్యాక్ డ్రాప్ పరంగా బాగానే మార్పులు చేర్పులు చేశారు. కానీ ఆధ్యంతం కథనంతో కట్టిపడేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. సినిమా ప్రారంభంలో పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ కోసం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఆసక్తికరంగా నడిపించారు. కానీ ఆ తర్వాతే గమ్యం లేని ప్రయాణంలా ప్రధాన పాత్రల్ని నడిపించడం వలన బాగా బోర్ కొడుతోంది. చూసే ప్రేక్షకుడు అబ్బా అనుకునేలా ఒక్క థ్రిల్ కూడా లేకపోవడం, ప్రతిదీ మనం ఊహించినట్టే జరుగుతుండడం, అలాంటి కథనానికి 140 నిమిషాల లెంగ్త్ కూడా టూ మచ్ అనిపిస్తుంది. ఇక దర్శకుడిగా తిగ్మన్షు ధులియా బ్యాక్ డ్రాప్ పరంగా, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, నటీనటుల లుక్ ని రీ క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు కానీ ఆధ్యంతం ప్రేక్షకుణ్ణి చూసేలా చేసినప్పుడే వీటన్నిటికీ విలువ ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత ఫ్రెండ్ షిప్ లో, పాత్రల మధ్య ఎమోషన్ అనే మేజిక్ ని క్రియేట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. హీరోయిజంకి చాలా అవకాశం ఉంది, కానీ గన్స్ పేల్చడమే హీరోయిజం అన్నట్టు చూపించడం మరింత నిరాశ కలిగిస్తుంది.

ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ ఇలా అన్ని డిపార్ట్ మెంట్స్ వారు టెక్నికల్ గా ది బెస్ట్ ఇచ్చారు. కానీ దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు.

విజిల్ మోమెంట్స్:

– మొదటి 30 నిముషాలు
– సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్
– స్టోరీ బ్యాక్ డ్రాప్

బోరింగ్ మోమెంట్స్:

– హిందీ, తెలుగులో చాలా సార్లు చూసేసిన కథ
– బోరింగ్ కథనం
– వీక్ డైరెక్షన్
– స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోవడం
– సప్పగా అనిపించే ట్విస్ట్స్

విశ్లేషణ:

యార – స్మగ్లర్స్ అయిన నలుగురు స్నేహితుల కథ. సినిమా మొదట్లో కనిపించిన ఎమోషన్ మధ్యలో ఏటో వెళ్లిపోవడం వలన, కథలోకి అనవసరమైన సబ్ ట్రాక్స్ ని కలిపేయడం వలన, చివరి వరకూ దాచిన రెండు ట్విస్ట్ లు కూడా సప్పగా ఉండడంతో టెక్నికల్ గా అన్నీ ఉన్నా కెప్టెన్ సరిగా వాడుకోలేకపోవడం వలన సినిమా ఏ పరంగానూ ఎంటర్టైన్ చేయలేకపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి కథలని మనం(హిందీ లేదా తెలుగు ప్రేక్షకులైనా) చాలా సార్లు చూసేసి ఉండడం వలన ప్రతి సీన్, ప్రతి ట్విస్ట్ ముందే చెప్పేయగలరు.

చూడాలా? వద్దా?: మీ సమయం వృథా తప్ప మీరు ఎంటర్టైన్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...