Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: బీజేపీ, టీడీపీ మళ్ళీ కలిసే ఛాన్సుందా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘2024 ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ముఖ్యమంత్రి ఎవరన్నది అప్పటి సమయాన్ని బట్టి రెండు పార్టీలూ కలిసి నిర్ణయం తీసుకుంటాయి. పవన్‌ కళ్యాణ్‌ ఛరిష్మా వున్న నాయకుడు. జనసేన పార్టీ ఓ సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే. పవన్‌ కళ్యాణ్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. పవన్‌ కళ్యాణ్‌ నన్ను సోమరాజు.. అని పిలుస్తారు..’ అంటూ జనసేనతో బీజేపీ పొత్తు గురించీ, జనసేనాని పవన్‌తో తన దోస్తీ గురించీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

‘టీడీపీతో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశముందా.?’ అన్న ప్రశ్నకు, ‘అది బీజేపీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ, టీడీపీ కారణంగానే మేం నష్టపోయామన్న విషయాన్ని మేమెప్పటికీ విస్మరించలేం. మా వల్లే టీడీపీ 2014 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంది..’ అని సమాధానమిచ్చారు సోము వీర్రాజు.

‘టీడీపీ మమ్మల్ని మోసం చేసింది. 2014లో పుంజుకుని, 2019లో మేం బలహీనమవడానికి కారణం టీడీపీనే. కాబట్టి, టీడీపీతో మళ్ళీ కలిసి పనిచేస్తామనే నమ్మకం నాకు లేదు..’ అని చెప్పారాయన. ఇంతకీ, ‘టీడీపీ – బీజేపీ’ మధ్య స్నేహం అంతలా ఎందుకు చెడింది.? అంటే, దానికి బలమైన కారణాలే వున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేసి, కేంద్రంలో – రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న విషయం విదితమే. ఓ దశలో కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సమర్థించిన టీడీపీ అధినేత చంద్రబాబు, వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్‌ చేయడం మొదలు పెట్టారు.

‘నేనే గొప్ప..’ అనే భ్రమల్లో, ప్రధాని నరేంద్ర మోడీని తూలనాడారు. ఇక్కడే బీజేపీ పెద్దల అహం దెబ్బతింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఎవరూ వుండరన్నది నిజమేగానీ.. చంద్రబాబు నిజస్వరూపాన్ని చూసిన బీజేపీ పెద్దలు, చంద్రబాబునీ, టీడీపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తోంది. లేకపోతే, రాష్ట్రంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల్ని తమవైపుకు లాక్కోవడమేంటి.? ఓ ప్రతిపక్షాన్ని ఇంకో విపక్షం దెబ్బకొడితే.. అది అధికార పార్టీకే లాభం కదా.! ‘వైసీపీని ఎంకరేజ్‌ చేసినా తప్పులేదు.. టీడీపీని మాత్రం ఎదగనీయకూడదు..’ అన్న భావనకి వచ్చేసింది బీజేపీ. పైగా, టీడీపీని నిర్వీర్యం చేస్తే.. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అవుతామన్న ఆలోచనతోనే బీజేపీ, టీడీపీకి షాక్‌ ఇవ్వడం మొదలు పెట్టింది.

మరోపక్క, చంద్రబాబు తన తప్పుని తెలుసుకుని, బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలూ పడుతున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఏమో.. చంద్రబాబు ఎలాగైనా మారగలరు.! అదే సమయంలో టీడీపీకి ప్రస్తుతం వున్న 38 శాతం ఓటు బ్యాంకు పట్ల బీజేపీ కూడా కాస్త సానుకూలంగా ఆలోచించే అవకాశం లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ‘టీడీపీతోగానీ, వైసీపీతోగానీ ఎలాంటి సంబంధాలూ పెట్టుకోం..’ అని ఇప్పటికే బీజేపీ, జనసేన సంయుక్తంగా పలుమార్లు ప్రకటించిన దరిమిలా, రాష్ట్రంలో 2024 నాటికి రాజకీయ సమీకరణాలు మారతాయా.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...