Switch to English

రఘురామ కొత్త ‘అస్త్రం’: వైసీపీని సరికొత్తగా ఇరకాటంలో పడేశారే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘మాట మార్చం.. మడమ తిప్పం..’ అని చెబుతుంటాం కదా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ, రాజధాని విషయంలో గతంలో ఏం నిర్ణయం తీసుకున్నాం.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం.? అని ప్రశ్నిస్తూ సొంతపార్టీపైనా తనదైన స్టయిల్లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.

‘అప్పుడు అమరావతికి కట్టుబడి వున్నామని చెప్పాం. అందుకే, అమరావతి పరిధిలోనే వైఎస్‌ జగన్‌ ఇల్లు కట్టుకున్నారని కూడా చెప్పాం. అప్పటి ముఖ్యమంత్రి కనీసం రాజధానిలో ఇల్లు కట్టుకోలేకపోయారని ఎగతాళి చేశాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం.?’ అని ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు.

తాజాగా రఘురామకృష్ణరాజు, రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా అమరావతిలోనే రాజధాని వుంచేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే వుందన్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లో తనకు రక్షణ లేకుండా పోయిన విషయాన్నీ రాష్ట్రపతి వద్ద ప్రస్తావించారు నర్సాపురం ఎంపీ. ‘నా సమస్యల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాను. నాకు ఆయన నుంచి సాంత్వన లభించినట్లయ్యింది. నా సమస్యల్ని ఆయన దగ్గర విన్నవించుకోగా, అన్ని సమస్యల్నీ ఆయన అర్థం చేసుకున్నారు..’ అని చెప్పారు రఘురామకృష్ణరాజు.

అమరావతి కోసం భూములిచ్చినవారిలో కమ్మ సామాజిక వర్గం వారికంటే, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా వున్నారనీ, ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికంటే దళితులు ఇంకా ఎక్కువమంది వున్నారని, వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతుండడం ప్రభుత్వానికి మంచిది కాదనీ చెప్పిన రఘురామకృష్ణరాజు, ఇప్పటికైనా రాజధాని విషయంలో ‘మూడు రాజధానుల’ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

‘పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మీద నాకు అపారమైన ప్రేమాభిమానాలు వున్నాయి..’ అంటూ మరోమారు రఘురామ తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా వుంటే, ‘ఒకవేళ మూడు రాజధానులు చేయాలనే ఆలోచనకే మీరు కట్టుబడి వుంటే, ఆ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని అమరావతికి పరిమితం చేయాలి..’ అని రఘురామ సూచించడం గమనార్హం. శాసన సభ, శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు నేపథ్యంలో జరిగిన పరిణామాల్నీ రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌కి ఇచ్చిన లేఖలో రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు.

రఘురామ కొత్త ‘అస్త్రం’: వైసీపీని సరికొత్తగా ఇరకాటంలో పడేశారే.! రఘురామ కొత్త ‘అస్త్రం’: వైసీపీని సరికొత్తగా ఇరకాటంలో పడేశారే.! రఘురామ కొత్త ‘అస్త్రం’: వైసీపీని సరికొత్తగా ఇరకాటంలో పడేశారే.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....