Switch to English

చైనాతో ఇరాన్ చెట్టపట్టాల్.. ఇండియాకు ఇబ్బందేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మన పొరుగుదేశాలను మచ్చిక చేసుకుని తన వైపు తిప్పుకుంటున్న చైనా.. తాజాగా మనకు మిత్రదేశంగా ఉన్న ఇరాన్ తోనూ వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. అమెరికాతో ఉన్న మన సంబంధాల రీత్యా ఇరాన్ ను నిర్లక్ష్యం చేయడం ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ఇరాన్, చైనాల మధ్య 2016 నుంచి పెండింగ్ లో ఉన్న 40 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం చకచకా కదులుతుండగా.. ఇరాన్ లో మనం చేపట్టిన రైల్వే ప్రాజెక్టు ఆరంభం కాకుండానే చేజారిపోయే పరిస్థితి రావడం ఇరాన్ తో మన బంధాలు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది వ్యూహాత్మక బంధం దృష్ట్యా ఇండియాకు ఇబ్బందికరమేనంటున్నారు.

ఇరాన్ ను ఆర్థికంగా అణదొక్కాలనే ఉద్దేశంతో అమెరికా ‘చాట్సా’ చట్టం కిందకు ఆ దేశాన్ని తెచ్చింది. అంటే.. అమెరికాతో సంబంధాలు కోరుకుంటున్న ఇతర దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కాదని కొనుగోలు చేస్తే అమెరికా విధించే ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో ఉన్న మన బంధం నేపథ్యంలో ఇరాన్ నుంచి మనం చమురు కొనుగోలు చేయడంలేదు. ఈ విషయంలో అటు అమెరికాతోనూ, దాని మిత్రదేశాలపైనా ఆధారపడి ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితి ఇరాన్ ఆర్థికంగా కుదేలు కావడానికి కారణమైంది.

అయితే చైనా మాత్రం అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడానికి 280 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదర్చుకుంది. అలాగే ఇరాన్ లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇవన్నీ ఇరాన్ కు ఊరటనిచ్చారు. దీంతో చైనాతో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఇరాన్ లోని హసన్ రౌహానీ సర్కారు ముందుకు కదులుతోంది. దీంతో ఇరాన్ లోని చాబహార్ పోర్టులో పనులు చేపట్టిన భారత్ కు ఇబ్బంది తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్టుకు సమీపంలోనే చాబహార్ పోర్టు ఉంది. భారత్ కు ఇది వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఈ పోర్టు అభివృద్ధి పనుల కోసం గత బడ్జెట్ లో మన కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కూడా కేటాయించింది. అయితే, చాబహార్, జహేదాన్ మధ్య తలపెట్టిన 628 కిలోమీటర్ల రైలుమార్గానికి సంబంధించిన పనుల్లో నెలకొన్న జాప్యం ఇరాన్ కు అసహనం కలిగించింది. దీంతో ఆ పనులు తామే చేపడతామని తాజాగా ప్రకటించింది. చైనా అండ నేపథ్యంలోనే ఇరాన్ ఈ మేరకు ప్రకటన చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రక్షణ భాగస్వామ్యం సహా పలు అంశాల్లో చైనాకు ఇరాన్ దగ్గర కావడం భారత్ కు సమస్యలు తెచ్చిపెడతాయని చెబుతున్నారు. ఇప్పటికైనా మన విదేశాంగశాఖ తగిన చర్యలు చేపట్టి.. ఇరాన్ తో బంధాన్ని కొనసాగించుకోవాలని సూచిస్తున్నారు. అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని, అలాంటి దేశం కోసం మన వ్యూహాత్మక బంధాల్ని బలిపెట్టడం సబబు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...