Switch to English

వైఎస్సార్సీపీకి రాజుగారి దెబ్బ.. ‘అంతకు మించి’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారంటే నాకు అమితమైన ప్రేమ. పార్టీకి నేను విధేయుడ్ని. పార్టీ పట్లగానీ, ముఖ్యమంత్రి పట్లగానీ తానెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు మాత్రమే చేశాను.. ముఖ్యమంత్రి గనుక నాకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే, అన్ని విషయాలపైనా వివరణ ఇస్తాను. నాకు నమ్మకం వుంది, ముఖ్యమంత్రి నన్ను పార్టీ నుంచి బయటకు పంపాలనే ఆలోచన చేయరు..’ అంటూ పదే పదే చెబుతున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కానీ, ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో పెద్దయెత్తున ‘కుట్ర’ జరుగుతున్న మాట వాస్తవం.. అనే రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

రఘురామకృష్ణరాజుకి విజయసాయిరెడ్డి నుంచి ఇప్పటికే షోకాజ్‌ నోటీస్‌ అందింది. దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే, ఏకంగా.. పార్టీ ఉనికిని ప్రశ్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు. అంటే, వైసీపీకి రఘురామకృష్ణరాజు కొట్టబోయే దెబ్బ, ‘అంతకు మించి’ అనే స్థాయిలో వుండబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ పేరు విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్‌ని రఘురామకృష్ణరాజు కలవడం, ఇదే విషయమై మీడియా ముందు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. ఇవన్నీ కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి. ‘విజయసాయిరెడ్డి చర్యలతో పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితులు వస్తాయేమో..’ అన్న అనుమానాల్నీ వ్యక్తం చేస్తున్నారు రఘురామకృష్ణరాజు.

స్వతహాగా ఆడిటర్‌ అయిన విజయసాయిరెడ్డి, పార్టీ లెటర్‌ హెడ్‌ విషయమై ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించి, రఘురామకృష్ణరాజుకి షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారు.? అన్న చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతుండడం గమనార్హం. పలువురు కేంద్ర మంత్రులతో ఎడా పెడా భేటీలు నిర్వహిస్తున్నారు రఘురామకృష్ణరాజు. అదే సమయంలో, ముఖ్యమంత్రి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు నర్సాపురం ఎంపీ. ఎక్కడా ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రిని డైరెక్ట్‌గా విమర్శించింది లేదు. కానీ, ‘బొచ్చులో నాయకత్వం అంటారా.?’ అంటూ ఆయనకు షోకాజ్‌ నోటీస్‌ వెళ్ళడం గమనార్హం.

నిజానికి, ఈ వ్యాఖ్యలు ఆయన చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నా, ‘ఆ సందర్భం వేరు’ అని చెబుతున్నారు రఘురామకృష్ణరాజు. ‘పార్లమెంటులో రాజ్యాంగబద్ధంగా తెలుగు భాష విషయమై మాట్లాడితే, దాన్ని పార్టీ తప్పుపట్టడమంటే.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ వ్యవహరిస్తోందా.?’ అని రఘురామకృష్ణరాజు సంధించిన ప్రశ్న.. రాజకీయ వర్గాల్లో మరింత ఉధృతమైన చర్చకు దారితీసింది. ‘ముఖ్యమంత్రికీ, నాకూ మధ్య మనస్పర్ధలు సృష్టించే ప్రయత్నం చేయొద్దు..’ అని విజయసాయిరెడ్డికి మీడియా వేదికగా రఘురామకృష్ణరాజు ఉచిత సలహా ఇవ్వడం కొసమెరుపు.

వైఎస్సార్సీపీకి రాజుగారి దెబ్బ.. ‘అంతకు మించి’.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...