Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: పెట్రోల్‌ ధర ఈసారి సెంచరీ తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అతి త్వరలో పెట్రోల్‌ ధర దేశంలో వంద రూపాయల మైలు రాయిని అందుకోనుందా.? అంటే, ఔననే అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. నిజానికి, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా తగ్గినా, మన దేశంలో మాత్రం.. వాహనదారులకు ఆ ‘ఫలాలు’ అందకుండా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ‘ఆయిల్‌ కంపెనీల మీద వున్న ప్రేమ’ సామాన్యుడి మీద పాలకులకు లేకపోవడం ఆశ్చర్యకరమే మరి.

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గగానే, కేంద్రం పన్నుల మీద పన్నులు వేసేస్తుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రాలూ తమకు తోచిన రీతిలో బాదేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. ‘పెట్రోల్‌ ధరల విషయంలో రాష్ట్రాలదే తప్పు. రాష్ట్రాలు తమ పన్నుల్ని తగ్గించుకుంటే, పెట్రోల్‌ ధర సామాన్యుడికి కాస్త ఊరటనిస్తుంది..’ అని బీజేపీ నేతలు ‘నీతి వాక్యాలు’ చెబుతుంటారు. కాంగ్రెస్‌ హయాంలో పెట్రో ధరలు పెరిగినప్పుడు మాత్రం, ఇదే బీజేపీ నేతలు ‘దేశద్రోహం’ అనే స్థాయిలో విమర్శలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

పైగా, ఇది కరోనా కాలం. దేశమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడిపోతోంది. సామాన్యుడి జేబులోకి రూపాయి రావడమే కష్టంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ‘ముక్కు పిండి మరీ’ పెట్రో బాదుడు ఏంటి.? అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం దొరకడంలేదు. ‘పెట్రో అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ప్రజలకే ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్రాలు చేసేది కూడా అదే.. ఆదాయం గణనీయంగా పడిపోయింది.. ఈ నేపథ్యంలో పెట్రో పన్నులు ఖజానాకి ఊపిరి పోశాయి..’ అని నిస్సిగ్గుగా చెబుతున్నారు అధికారంలో వున్న వారు.

నిజమే, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలంటే అధికార పార్టీలకు ఖజానా కళకళ్ళాడాలి.. ఆ ఖజానా నింపడానికి మళ్ళీ సామాన్యుడి జేబు.. కాదు కాదు, సామాన్యుడి పొట్ట కొట్టాల్సిందే. ఇదా అభివృద్ధి.? అని ప్రశ్నిస్తే.. ‘దేశద్రోహులు’ అనే ముద్ర వేసేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఆల్రెడీ 80 రూపాయలు దాటేసిన పెట్రోల్‌ ధర, జులై చివరి నాటికి సెంచరీ కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు సర్వత్రా విన్పిస్తున్నాయి. పెట్రోల్‌తోపాటు డీజిల్‌ కూడా అనూహ్యంగా పెరుగుతున్న దరిమిలా, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటేస్తున్నాయి. గోరు చుట్టు మీద రోకలి పోటు.. అంటే ఇదే మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...