Switch to English

కరోనా అలర్ట్‌: రికవరీలే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువే..’ అని కేంద్రం చెబుతోంది. నిజమేనా.? గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఎలా వున్నాయి.? లాక్‌డౌన్‌ సత్ఫలితాలనిచ్చిందా.? పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేసిందా.? ఇలా రకరకాల ప్రశ్నలు.. వేటికీ సరైన సమాధానం దొరకడంలేదు. లాక్‌డౌన్‌తో సాధించింది ఏంటి.? అని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో కూరుకుపోవడమొక్కటే కన్పిస్తోందన్నది చాలామంది అభిప్రాయం. కానీ, అదే లాక్‌డౌన్‌ లేకపోయి వుంటే, ఈపాటికే దేశంలో 20 నుంచి 30 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయి వుండేవన్నది కేంద్రం వాదన. కానీ, ఇప్పుడు ఏం జరుగుతోంది.? నిన్న 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నేడు ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే స్థాయిలో వాదనలు విన్పిస్తున్నాయి.

ముందు ముందు రోజువారీ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించడమే భయానకంగా అన్పిస్తోంది. మరి, లాక్‌డౌన్‌తో ఏం సాధించినట్లు.? ఇక, రికవరీలు పెరుగుతుండడం ఊరటనిచ్చే విషయమే. కానీ, అదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్నే తీసుకుంటే, తెలంగాణలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య కూడా గత కొద్ది రోజుల నుంచి ఆందోళనకర రీతిలో పెరుగుతుండడం గమనార్హం. మహారాష్ట్రంలో కరోనా స్వైరవిహారమే చేస్తోంది. తమిళనాడు, ఢిల్లీ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. దాదాపుగా దేశంలో అన్ని రాష్ట్రాలూ రోజువారీ కేసుల నమోదులో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తుండడం గమనార్హం. వలస కూలీలు స్వస్థలాలకు వెళుతుండడంతో కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ఎక్కువగా క్వారంటైన్‌ కేంద్రాల్లో వున్నవారి నుంచే కేసులు వెలుగు చూస్తుండడం కొంత ఊరటనిచ్చే విషయమే.

అయినాగానీ, కరోనా వైరస్‌కి సంబంధించి పరీక్షలు జరగాల్సిన స్థాయిలో జరగడంలేదన్న విమర్శలున్నాయి. సామాజిక వ్యాప్తి ఎప్పుడో ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్‌ అనేది అవసరమే అయినా, ఆ స్థాయిలో అది కూడాజ జరగడంలేదన్న వాదనలూ లేకపోలేదు. మొత్తంగా చూస్తే, జూన్‌ నెలాఖరునాటికి కరోనా దేశంలో పీక్‌ స్టేజ్‌కి వెళ్ళొచ్చన్న అంచనాలే నిజమయ్యేలా వున్నాయి. మరోపక్క, జూన్‌ నెలాఖరుకు కాదు.. ప్రమాదపు అంచులు.. జులై చివరి నాటికి చూడబోతున్నాం.. అంటూ మరింత భయాందోళనకరమైన విషయాన్ని చెబుతున్నారు. వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే అవకాశాల్లేకపోవడం.. దేశంలో వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో.. రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందే. నిన్న 9 వేల కేసులు.. సుమారు రెండొందల యాభై మరణాలు దేశవ్యాప్తంగా సంభవించిన దరిమిలా.. ముందు ముందు మరణాల సంఖ్య అత్యంత వేగంగా పెరిగే అవకాశముందనే అంచనాకి వస్తున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...