Switch to English

టీటీడీ భూముల అమ్మకాన్ని తప్పు పట్టిన వైసీపీ ఎంపీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

టీటీడీ భూముల వేలం వ్యవహారం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తమిళనాడులో వున్న భూముల్ని వేలం వేయడం ద్వారా సొమ్ము చేసుకోవాలన్న టీటీడీ ఆలోచనపై భక్తలోకం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ హయాంలోనూ భూముల వేలం వ్యవహారం నడిచిందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుకాయించొచ్చుగాక. కానీ, అధికార పార్టీకి చెందిన ఎంపీనే, టీటీడీ భూముల వేలం వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘దేవుడికి భక్తులు ఇచ్చిన భూములవి. అలా భూముల్ని దేవుడికి ఇవ్వడం వెనుక భక్తులకు కొన్ని సెంటిమెంట్లు వుంటాయి. డబ్బు వేరు.. భూమి వేరు.. ప్రభుత్వం ఈ విషయంలో హుందాతనంగా వ్యవహరించి వుండాల్సింది..’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందాలంటే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో సఖ్యతగా వుండక తప్పదని రఘురామ కృష్ణంరాజు మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత కొంతకాలంగా వైసీపీలో రఘురామకృష్ణంరాజు వ్యవహార శౖలి పార్టీ అధిష్టానానికే అర్థం కాకుండా వుంది.

‘నేను ప్రస్తుతానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీనే. అదే సమయంలో నాకు భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. నా వరకూ నేను నా నియోజకవర్గ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అవసరమైనప్పుడల్లా కేంద్ర మంత్రుల్ని కలుస్తుంటాను. ఇందులో రాజకీయ పరమైన అంశాలకు తావు లేదు.. వైసీపీని నేను వీడబోవడంలేదు.. వీడాలన్న ఆలోచన కూడా లేదు. అయితే, సందర్భానుసారం నా అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టే స్వేచ్చ నాకుంది. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా అర్థం చేసుకుంటుందనే విశ్వసిస్తున్నాను..’ అంటూ రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు.

ఇదిలా వుంటే, టీటీడీ భూముల అమ్మకం వ్యవహారం పెను దుమారం రేపుతోంది. వెంకన్న భూములపై రాజకీయ కుట్ర జరుగుతోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...