Switch to English

పరీక్షలు పెంచాల్సిందేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

‘తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్లే ఈ ఫలితం సాధించగలిగాం. ప్రజలు మరికొంత కాలం సహకరిస్తే పూర్తిగా ఈ మహమ్మారి నుంచి బయటపడొచ్చు’ – ఇదీ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రజలకు చేసిన వినతి.

నిజంగా ఇది మంచి పరిణామమే. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పల్లెల్లో లాక్ డౌన్ వంద శాతం పక్కాగా అమలవుతోంది. కానీ నగరాలు, పట్టణాల్లో మాత్రం ఉల్లంఘనలు సాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇవీ మరీ ఎక్కువ. తాజాగా నమోదవుతున్న కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. మరోవైపు లాక్ డౌన్ అమలు విషయంలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు.. కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మాత్రం అలా వ్యవహరించడంలేదు.

తెలంగాణ మొత్తంగా ఇప్పటివరకు 18,756 పరీక్షలు మాత్రమే చేశారు. సాధారణంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయినవారికి ఈ పరీక్షలు నిర్వహిస్తే చాలు. కానీ జిత్తులమారి కరోనా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. పరిస్థితులకు తగినట్టుగా తనను తాను అప్ గ్రేడ్ చేసుకుంటోంది. లక్షణాలు లేనివారికి కూడా పాజిటివ్ వస్తోంది.

మహారాష్ట్రలో దాదాపు 80 శాతం మంది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలూ లేవు. తెలంగాణలో సైతం ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఎంత ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే అంత మంచిది. కాంటాక్ట్ కేసులు, వారికి సన్నిహితంగా ఉన్నవారితోపాటు ర్యాండమ్ గా ఈ పరీక్షలు చేయడం వల్ల దాగి ఉన్న వైరస్ కేసులను వెలికి తీయొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అలా చేయకుంటే లక్షణాలు కనిపించని వ్యక్తుల ద్వారా మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ఒక్క కేసు కూడా నమోదు కాని రోజు నుంచి కనీసం 20 రోజులపాటు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేసినప్పుడే ఈ మహమ్మారిని నిరోధించగలుగుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి ఎండలకు ఈ వైరస్ మనలేదని తొలుత వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదని వివరిస్తున్నారు. ఈ వైరస్ మరింత శక్తివంతమైందని, 92 డిగ్రీల వేడి వద్ద 15 నిమిషాలపాటు ఇది బతుకుతోందని తాజా పరిశోధనలో వెల్లడైందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పక్కాగా పాటించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఆవశ్యకమని స్పష్టంచేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...